వారణ కథ.
1391
పరలోకగతుఁ డయినతర్వాత పెద్దకుమారుని శీలధరుని చిన్నవాఁడు సత్యధరుఁడు తఱిమి వేసి రాజ్యమును తాఁ గైకొనెను. అంతట నా పగచేత శీలధరుఁడు శంకరుం గూర్చి తపస్సు చేసి మెప్పించి ప్రత్యక్షము చేసికొని 'దేవా, నేను గంధర్వుఁడను గావలయు, దాన నాకాశగామినై నాదాయాదుని సత్యధరుని అవలీలగా జయింప నగును. నా కట్లనుగ్రహింపుము' అని వర మడిగెను. శంభుఁ డిట్లానతిచ్చెను:- 'మంచిది నీవు కోరినట్లే యగును, కాని నీశత్రువు ఇపుడు మృతుఁ డైనాఁడు. రాఢానగరములో ఉగ్రభటుఁ డనురాజునకు సమరభటుఁ డనుపేర కుమారుఁడుగా జన్మించును, నీవును వానికి అన్నవుగా సవతితల్లికడుపునం బుట్టుదువు, వానిం బరిమార్చి నీవు రాజ్య మేలుదువు. నీవు పగఁబూని తపస్సు చేసితివిగాన మునిశాపమున పదభ్రష్టుఁడవై వనగజమ వవుదువు. నీకు పూర్వజన్మజ్ఞానమును వ్యక్తవాక్కును గలుగును. నీవు అట్లుండి బడలినయతిథిని ఎప్పుడు ఉపచరించి సేద దేర్చి యాతనికి నీవృత్తాంతము చెప్పుదువో అప్పుడు గజత్వము పోయి గంధర్వుఁడ వగుదువు, అపుడే ఆయతిథికిని ఉపకార మగును.' ముక్కంటి యీవిధమున నానతిచ్చి యంతర్ధానము కాఁగా, శీలధరుఁడు చిరతపఃక్షీణమయిన తన దేహమును గంగలో వైచెను.
తర్వాత రాఢానగరమందు ఉగ్రభట భూపాలుఁడు సవర్ణ యగుపట్టపుదేవి మనోరమతో సుఖం బుండ నొకనాఁడు