1390
కథాసరిత్సాగరము. లం. 12. త. 7.
వాఁడై, గోతులలోఁ బడుట, ఆహారము లేమి, ఇట్టిఖేదములు తీర్చున దగుటచే నా కెంతయు నిష్టమైనను మృత్యువును మాత్రమెంత వేఁడినను ఒసంగఁ డాయెను. నాయాఁకటిబాధ యిపుడు నీవలనం దీఱుటం బరికింప నాగ్రుడ్డితనమును నీకృపవలననే తీఱు నని తలంచెద. నీ వెవరో దైవత మవు.' ఇట్లు అతఁడు పలుకఁగా నిశ్చయము తెలిసి మృగాంకదత్తుఁడు హర్ష శోకము నడుమం బడినవాఁడై మంత్రులతో నిట్లనియె. - 'ఇతఁడు ప్రచండశక్తియే. అయ్యో! ఎట్టికష్టదశకు వచ్చినాఁడు, ఇపుడే త్వరగా నితని మనము సంభావించుట సరిగాదు. ఒకవేళ నితనికీయేనుఁగు నేత్రోపకారము గూడ చేసినం జేయును మనలం గనిన నిది యవలికి తొలంగి పోయినం బోవును. కాన ఈవిషయమున తుదిం గనవలయును.' ఇట్లు పలికి యనుచరసహితుఁడై వినుచు నచటనే యుండెను. అంతట ప్రచండశక్తి ఆవారణ రాజమును 'అయ్యా, మహాత్మా, నీ వెవరో, నీకు ఈగజత్వ మేల కలిగెనో, సమదునికి నిర్మద మైన యీ వా క్కెట్లు గలిగెనో, నాకుం దెలియఁ జెప్పుము.' అని యడిగెను. నిట్టూర్పు నిగిడించి గజేంద్రుఁ డిట్లు చెప్పం దొడంగెను.
వారణకథ.
నావృత్తాంతము నామూలముగాఁ జెప్పెదను వినుము. ఏకలవ్య యను నగరమున శ్రుతధరుఁ డని రా జుండెను. ఆయన కిరువురు భార్యలు, ఇరువురకు నిరువురు కుమారులు, తండ్రి