1388
కథాసరిత్సాగరము. లం. 12. త. 7.
సార్థకనాముఁ డగు విచిత్రకథకమంత్రివలన మృగాంకదత్తుఁడు కడమవారితోఁగూడ నత్యానందముం బొంది ఆరాత్రి ఆయడవిలోనే గడపి తదనంతరము నాగశాపవియోజితులను ఇంకను కలసికొనని కడమమంత్రులను వెదకుచు శశాంకవతికై యుజ్జయినికి పయనము సాగించెను.
7 - వ తరంగము.
ప్రచండశక్తి కథ.
అనంతరము ఆనలువురుమంత్రులతోను ఉజ్జయినిం గూర్చి వింథ్యారణ్యములో పయనము నడచుచు మృగాంకదత్తుఁడు దారిలో కాయలు పండ్లు దట్టంపునీడ తీయని చల్లని తేటనీటి తటాకములుం గలిగి సకలేంద్రియములకుం బండువుగా నున్న యొకకానం గని అందు విడిసెను. అందు సచివులతోఁ గూడ స్నాన మాడి, ఫలములు భుజించి, ఒక్కప్రక్క తీపగుబురులో సంభాషణంబోలె విని కుతూహలముచేత పోయి చూచునంత నట తీపలలోపల నొక గొప్పయడవియేనుఁగు దారి నడకచే నలసినయొకపురుషునికి అంధునికి తొండముతో నీళ్లు పండ్లు తెచ్చి యిడుచు చెవివీవనలతో చల్ల గాలి వీచుచు, సేద దేర్చుచు, స్ఫుటముగా మనుష్యవాక్కులతో 'అయ్యా,