1382
కథాసరిత్సాగరము. లం. 12. త. 6.
శుని ఇట్లు స్తుతింపసాగెను:- 'సుమేరుశిఖరమువలె కల్యాణమయమూర్తివై నక్షత్రమాలాలంకృతో త్తమాంగుండ వగు నీకు నమస్కారము ; నృత్తోత్సవమందు నీవు సరళముగాఁ బైకెత్త నాకసము డుయ్యుచు త్రైలోక్యభవనంపునిట్రాడువోలె నొప్పు నీకరమునకు నమస్కారము; ఓవిఘ్ననాశకా, సర్వసిద్ధులకును మూలకారణ మయిన నీపాపసొమ్ముల పెద్దబొజ్జకడుపునకు నమసార్కము.' ఈతీరున నట బ్రహ్మసోమ మహాయోగి గణేశుని స్తవము సేయుచున్న తఱిని ఆవినాయకప్రతిమ నటకుం దెచ్చిన యుపేంద్రశక్తి కుమారుఁడు మహేంద్రశక్తి యనువాఁడు పిచ్చి యెత్తి యథేచ్ఛము తిరుగుచుండువాఁడు అచటికి దైవవశంబున వచ్చి యా మహాయోగిం గని అతని మీఁదికి పరువెత్తి పట్టుకొనఁ బోయెను. అంతట నాయోగి యాతనిని సమంత్రకముగా చేత నడిచెను. అంత నావణిక్కుమారుఁడు వెఱ్ఱి కుదిరి తెలివి వచ్చి తన దెసమొలతనమునకు లజ్జితుఁ డై చేతితో గోచి మూసికొని తన యింటికిం బోయెను. వాని రాకను మున్నుగా లోకులవలన విని తండ్రి ఎదురు వచ్చి ఆనందపూరితమానసుఁ డై పుత్త్రుని ఇంటికిం గొని పోయెను. ఇంట వానిని స్నాన మాడించి వస్త్రాదికముల నలంకరించి వెంటం బెట్టుకొని ఆబ్రహ్మసోమ మహాయోగికడకు వచ్చెను. పుత్త్రదాత యయిన యాతాపసునికి విస్తారము ధనము తెచ్చి