Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీదర్శనుని కథ.

1375

మునే కత్తితో నఱికి యతని కాహార మిడెను. అంత బేతాళుఁడు తనివిఁ జెంది యిట్లనియె: – 'ఓయి మహాసత్త్వుఁడా, నిన్ను నేను మెచ్చితిని. నీయొడలు అక్షత మగును. నన్నుంగొని పొమ్ము. ఈకార్యము నీకే సిద్ధించునులే, ఆసాధకుఁడు స్వల్పసత్త్వుఁడు. వాఁడు నశించును. అట్లు బేతాళుఁడు పలికిన మాత్రాన శ్రీదద్శనుఁడు స్వస్థదేహుఁడై బేతాళుని గొనిపోయి సాధకుని కిచ్చెను. సాధకుఁడు సంతోషించి విరిదండలతోను మైపూఁతలతోను ఎఱ్ఱవానితోఁ బూజించి, మానిసియెమ్ముల సున్నంపు మ్రుగ్గుతో గొప్పమండల మొకటి లిఖించి దాని మూలల నెత్తుటికుండ లుంచి మానిషిక్రొవ్వుతైలంబున దీపము వెలిగించి నడిమి గొప్పవిరివిలో బేతాళాధిష్ఠిత మైన యాశవమును వెదకిలం బరుండఁ బెట్టి తాను దాని ఱొమ్ముపైఁ గూర్చుండి మనుష్యాస్థినిర్మితము లైన స్రుక్స్రువములతో దానినోట వేల్వఁ దొడంగెను. నిముసములో ఆబేతాళునినోటి నుండి బెట్టిదంపుజ్వాల యొకటి బయలువెడలెను. దాన నాసాధకుఁడు వెఱ గొని లేచి యవలికి జరిగెను. బమగొని చేతిస్రుక్స్రువముల జాఱవిడిచెను. అంతట సత్త్వ మెడలిన యాసాధకుని తఱుముకొనిపోయి బేతాళుఁడు నోఱు తెఱచి సాంగోపాంగముగాఁ దిగఁబాఱ మ్రింగెను. దానిం గని శ్రీదర్శనుఁడు కత్తి యెత్తి మీఁదికి రాఁగా బేతాళుఁడు 'ఓయి శ్రీదర్శనుఁడా ఇట్టి నీధైర్యమునకు సంతసించితిని. నానోటి యీ యావాలను