1368
కథాసరిత్సాగరము. లం. 12. త. 6.
ములో సూర్యాస్తమయ మయినపిమ్మట నిప్పుడు నేను ఏమి చేయనుం దెలియక దుఃఖావిష్టుఁడనై యేడ్పును శరణుఁజొచ్చితిని. సాధువులారా, మీరు దయచేసి ఎవనినేని మంచి బ్రాహ్మణుని ఈయన ప్రాణముతో నుండగానే కొని రండు. ఈయన తనచేతిమీఁదుగానే మాకున్న దానిని బ్రాహ్మణుని కిచ్చుకొనును గాక. ఈయన యెట్లును ఈరాత్రిని దాఁటఁజాలడు. ఈయన నెడఁబాసి నేను బ్రదుకఁజాలను. ఱేపు నే నగ్ని ప్రవేశము కావించెదను. మహాత్ములారా, మా యీ వేఁడికోలును నెఱవేర్పుఁడు. మీరే కదా ఇట కనికర మూని మమ్ము గనవచ్చినయకారణబాంధవులు.”
దొంగలు జాలిగొని, తమదొరకడ కేఁగి వృత్తాంతముఁ దెలిపి 'సామీ, చంపి కొనవలసినదానిని దానముగాఁ గొందువు రమ్ము.' అని పిలిచిరి, 'ఇ దెట్లు సరిపడును? చంపక ధనము గొనుట మనకు నీతివిరుద్ధము. హృతధనుఁడు మిగిలి యున్నచో తప్పక ముప్పు దెచ్చును.' అని వసుభూతి వచించెను. ఇట్లు పలికిన యా పాపాత్మునితో బంట్లు 'సామీ, తమ కేల ఇంతసందేహము? హరించుట యెక్కడ, చావనున్న వానివలన దానము గొనుట యెక్కడ? ఱేపు వా రిరువురు బ్రదికియుండిరేని చంపి వేయుదము. వృథాగా బ్రహ్మహత్య యేలకట్టుకొనవలయును?’ అని పల్కిరి. వసుభూతి వారిమాట కంగీకరించి రాత్రియే ప్రతిగ్రహార్థము శ్రీదర్శనుకడకు వచ్చెను. శ్రీదర్శనుండును దాఁచి