శ్రీదర్శనుని కథ.
1363
మియుం జేయవు.' అని చెప్పి యతనికి అజినమంత్రము లిచ్చి ముని తనదారిం బోయెను. రాజు ధైర్య ముని మరల పండ్రెండుసంవత్సరములు ఈశ్వరుంగూర్చి ఆ తీర్థమున తపంబు సల్పెను. అంతట కుముదిని యతనికడకు తాను స్వయముగానే వచ్చెను. ఆమెతో నతఁ డనంతరము పాతాళమునకుం బోయి భోగము లనుభవించి తుదను సిద్ధిని సయితము పొందెను. ఇట్లు కలఁకపడక ధైర్య మవలంబించువారు దూర మెడలిన నిజపదవిని మరల సాంధితురు.
శ్రీదర్శనా, నీవు, కల్యాణ మొందఁగలవాఁడవు, శుభలక్షణుఁడవు, కలఁతపడి భోజనము మాని నిన్ను ఒప్పరికించు కొనియెద వేమి? ఇట్లు మిత్త్రుఁడు ముఖరకుఁడు ద్యూతశాలలో పలుకఁగా ఆమునుపటిరేయి భోజనము లేకయుండిన శ్రీదర్శనుఁ డిట్లనియె.—'మిత్త్రుఁడా, నీవు చెప్పిన దెల్ల సరియే, ఐనను కులీనుఁడ నయ్యును ఈవిధముగా జూదమున పేదనై ఈయూర నేను బయట నెట్లగపడఁగలను. కావున ఈరాత్రి యే నన్ను దేశాంతరము పోనిత్తువేని భోజనము చేసెదను.' ఆమాటకు ముఖరకుఁ డంగీకరించి అతనికి భోజనము తెచ్చి పెట్టెను. శ్రీదర్శనుఁడు భుజించెను. భోజనము కాఁగానే శ్రీదర్శనుఁడు, మైత్త్రిచే ముఖరకుఁడును తనతోడ రా, దేశాంతరమునకుం దరలెను. అట్లు పోవుచున్న యతనిని దారిలో దైవవశమున తల్లిదండ్రు లయిన యాయక్షు, లిరువురును సౌదామన్యట్టహాసులు,