Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భూనందనుని కథ.

1361

పోయెను. అచట గట్టున నున్న చెట్టున వ్రేలుచున్న పీసుంగుమేని నెత్తురుక్రొవ్వుల కల్లుతో నిండియున్న యొక బావిగట్టున నాతనితోఁగూడ నామె కూర్చుండెను. అంత నామె యాక్రొవ్వుఁగల్లు నించి యొకకోర నతనికిఁ ద్రావ నిచ్చెను. రాజు దానిని ఏవగించెను, గ్రహింపఁ డాయెను 'ఈమాపానమును గైకొనవేని సేమ మొందవు.' అని యామె బలవంతపెట్టఁగా, 'ఏ మయినం గానిమ్ము, త్రాగ రాని దీనిని నేను త్రాగను.' అని రాజు ఆమెతో ననెను. అంత నామె ఆకోర నతని నెత్తిని వేసి అవలికిఁబోయెను. అతఁడు మోము ముడుఁచుకొని కోరచూపులు చూచుచుండ, నామె చేటికలు అతనిని వే ఱొకడిగ్గియలో వేసిరి. వేసిన మాత్రాన నతఁడు తనతొంటితపఃస్థాన మైనయాక్రమసర స్తీర్థమందు తన్ను తాఁ గన్గొనియెను. క్రమ్మియున్న మంచుచేత తన్ను నవ్వుచున్నది వోలె నొప్పు నాకొండను గాంచి యతఁడు బెగ్గిలి వింతపడి ఏమియుం దోపక మోసపోయి ఇట్లు తలపోసెను:-'ఆ యసుర కన్యయాటతోఁట యెక్కడ! ఈక్రమసరోగిరి యెక్కడ! ఆహో! ఇ దేమి యాశ్చర్యము. మాయయో మతిభ్రమయో? ఇది మఱియేమియుఁ గాదు, నేను మునిమాట వినియు ఆకన్నియమాట నుల్లంఘించిన ఫలము. ఆ పానము దూష్యము గాదు. ఆ కన్నె నన్ను పరీక్షించున దై దానిని ఆ రూపమున నొసంగినది, ఏలన, నానెత్తిపయిం బడిన యా పానమునుండి దివ్య మయిన నెత్తావి కదంబించుచున్నది. కాన తప్పకుండ అదృష్టహీనులు ఎంత