Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1358

కథాసరిత్సాగరము. లం. 12. త. 6.

దళుకొత్తు చుండెను. దానినడుమ మిక్కిలివిశాలమై రతనంపుఁ దాపలు మెఱయ, పసిండిగోడలు, మాణిక్యస్తంభములు, చంద్రకాంతశిలానిర్మితము లయిన పెదపెద్ద యరంగులును, గల యున్నతంపు శివాలయ మొకటి యగపడెను. కని వా రెల్ల సంతోషాశ్చర్యమగ్నులై యుండ మహాముని రాజును శిష్యులను 'ఈతఁడే పాతాళనిలయుఁడు హాటకేశ్వరుఁడు. మూఁడులోకములను ఈదేవుం బాడుదురు గదా. కావున నీవేల్పుం బూజింపుఁడు.' అని హెచ్చరించెను. అంత నెల్లరును పాతాళగంగలో స్నాన మాడి పాతాళపుష్పములతో హాటకేశ్వరునిం బూజించిరి. ఆపూజాక్షణమాత్రమే విశ్రాంతిగా వారు మఱలం బయనమై యట పండ్లు పండి క్రిందికి రాలుచున్న యొకగొప్ప నేరేడుఁజెట్టును గనిరి. అంతట నాముని ఇతరులతో దానిఫలములు తినవల దనియు అవి విఘ్న కారు లనియును జెప్పెను. ఆమాట వినియు నొకశిష్యుఁడు ఆఁకట నొకపండు తిని వెంటనే నిశ్చేష్టుడై స్థావరాకృతిం బొందెను. వానియవస్థం గని వెఱచి యితరులు ఆపండ్లపై యాస గొనరైరి. అంత నామౌని రాజుతోను కడమశిష్యులతోను క్రోశదూరము పోఁగా నచట నొక బంగారపుంబ్రాకారము మణిమయ ద్వార సనాథము అగపడెను. ఆద్వారమున కిరుప్రక్కలను రెండు ఇనుపపొట్టేళ్లు వీరిని చొరనీయక కొమ్ములతోఁ గ్రుమ్మ వచ్చినవి. మునీశ్వరుఁడు వానిని మంత్రసమేత మైన కఱ్ఱతో తలపైఁ గొట్టఁగానే