1352
కథాసరిత్సాగరము. లం. 12. త. 6.
రాధకుని కతనికి కలలో నిట్లు పలికెను. 'నీకు ఔరసపుత్త్రుఁడు లేఁడు. కృత్రిమపుత్త్రుఁడు గలుగును. వానిమూలమున, ఓ బ్రాహ్మణుఁడా, నీపేదరికము తీరును.' ఇట్లగ్ని దేవుఁడు పల్కఁగా, బ్రాహ్మణుఁ డెదురు సూచుచు సుఖ మున్నాఁడు. అతనికి మన శిశువును ఇయ్యవలసినది. నియతి యిట్లున్నది.”
అట్టహాసుఁడు ప్రేయసితో నిట్లు చెప్పి శిశువును బంగారు కుండమీఁద కూర్చుండఁ బెట్టి వానిమెడకు దివ్యరత్నమాల యొకటి కట్టి వానిని రాత్రి దేవదర్శనుఁడును నతని భార్యయును నిద్రపోవుచుండఁగా వారి యింటం బెట్టి తాను భార్యతోఁగూడ నిజగతిం బోయెను.
దేవదర్శనుఁడు సభార్యుడు మేల్కొని ప్రకాశమానరత్న తారకు నాబాల చంద్రుం గాంచి, అబ్బురపడి బంగారు నాణెములకుండను గని అగ్ని దేవుని వరమును స్మరించి సంతోషించెను. దైవ మిచ్చిన యాతనయునిం గయికొని ధనమునుం గొని తెల్లవాఱఁగానే మహోత్సవము సల్పి, పదునొకొండవ దినమున తనకుఁ దగినట్లుగా బాలకునికి, శ్రీదర్శనుఁ డని నామకరణము చేసెను. అనంతరము దేవదర్శనుఁడు మహాధనుఁడై క్రతువు లొనర్చుచు భోగము లనుభవించుచు పుత్త్రకళత్రములతో సుఖ ముండెను. శ్రీదర్శనుఁడును తండ్రియింట ఎదుగుచు వేదవిద్యలయందే గాక అస్త్రవిద్యలయందును ప్రకర్షముం