Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీదర్శనుని కథ.

1351

వగచుచుం బోయి యావృత్తాంతమును నా తల్లిదండ్రుల కెఱుక వఱిచి మరల సంగమము గలుగు నని యెదురు సూచుచు కాలము పుచ్చుచుంటిని. నీవే ఆయట్టహాసుఁడవు, నేను ఆసౌదామనిని, మన మిరువురము నిట నిట్లు కలిసికొంటిమి. మనకు త్వరలోనే కుమారుఁడు తప్పక పుట్టును.

ఈరీతిని జ్ఞానవంతురాలు సౌదామని పలుకఁగా పవిత్రధరుఁడు పుత్త్రోత్పత్తి కలుగునుగదా యని సంతసించెను. తర్వాత కాలక్రమమున నతనికి ఆయక్షిణియందు సుతుఁడు కలిగెను. ఆశిశువుచే వారియిల్లును వారియుల్లంబును వెలుఁ గొందిన వాయెను. పవిత్రధరుఁడు ఆపుత్త్రుని మోముం గాంచి తత్క్షణము అట్టహాసుఁడుగా నిజపూర్వకృతిం బొందెను. యక్షిణితో 'ప్రియా, మనశాపము తీఱినది. నేను అట్టహాసుఁడ నయితిని, రమ్ము మన తొంటిగతికి మనము పోవుదము' అని హెచ్చరించెను. ఇట్లతఁడు పలుకఁగా నామె 'ఈశిశువు నీతమ్ముఁడే గదా, శాపమున నిట్లు మనకు సుతుఁ డైనాఁడు. వీఁ డే మగునో ఆలోచింపవలదా?' అనెను. అంత నట్టహాసుఁడు ధ్యానముచేఁ గని ఆమెతో నిట్లనియె:- “ప్రేయసీ, ఈనగరమున దేవదర్శనుఁడని పంచాగ్ని బ్రాహ్మణుఁ డొకఁడు కలఁడు. ఆయన కరము దరిద్రుఁడు, అతనికి తనజఠరంబు తనభార్యజఠరంబు నని మఱి రెండు అగ్నులు మండుచుండినవి. ఆదరిద్రుఁడు ధనపుత్త్ర కాముఁడై తప మొనర్చుచుండఁగా నొకనాఁడు అగ్ని దేవుఁడు నిజా