Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్యాణవతి కథ.

1045

బోయి, ఆయన దిగులుపడి యడుగఁగా, జరిగినవృత్తాంతము చెప్పెను. ఆయన అల్లుని సమ్మానించి గుఱ్ఱములను ఏనుఁగును ఇచ్చి పంపెను.

అంతట సింహబలుఁడు శత్రు విజ యోద్యతుఁ డై, కల్యాణవతిని అచటనే ఆమె తండ్రియింట ఉంచి, ప్రబలుఁ డయిన గజానీకరాజునొద్దకుఁ బోయెను. అతఁడు పోయిన కొంతకాలమునకు ఒకనాఁడు దేవి కల్యాణవతి కిటికీలోనుండి ఒక పురుషుని చూచి, చూచినమాత్రమున వానిచే హృతచిత్తయై మదనాకృష్ట యై యిట్లు తలఁచెను:- 'ఆర్యపుత్త్రుని కంటె అందగానిని శూరుని ఎఱుఁగను, అయినను ఈపురుషుని యందు నామనస్సు ఆసక్త మై యున్నది. కనుక ఏ మయినఁ గా నిమ్ము. వీనిని సేవించెదను.' ఇట్లు నిశ్చయించుకొని ఆమె తన యభిప్రాయమును రహస్యధారిణి యయిన చెలికి చెప్పెను. అదియే వానిని రాత్రి కొని వచ్చి కిటికీగుండ త్రాటిమీఁదుగా ఎక్కించి అంతిపురిలో ప్రవేశపెట్టెను. వాఁడు ఆమెయొక్క తేజమునకు భయపడి ఆమెమంచము నెక్క ధైర్యము లేక ప్రక్కను మఱియొక యాసనమున కూర్చుండెను. దానిం గని రాణి 'అయ్యో! వీఁడు నీచుఁడు!' అని చింతించుచుండఁగా, పైనుండి పా మొకటి వచ్చెను. దానిం గని ఆపురుషుఁడు భయపడి లేచి ధనుస్సు కొని కోలం గూల్చి చచ్చినదానిని కిటికీ గుండ వెలికి పాఱ వేసి భయము తీఱి హర్షముతో నర్తనము