Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విచిత్రకథకునికథ.

1347

అతఁడును మేల్కొని మృగాంకదత్తు గని హర్షమున పాదములకు మ్రొక్కి నిలిచెను. దొర అట్లు ఆకస్మికముగా దొరకిన యావిచిత్రకథకునిం గన్నులు తనియం గాంచుచుఁ గవుంగిలించుకొనెను. ఇంతలో నతని కడమ మంత్రులు మేలుకొని సంతసించిరి. విచిత్రకథకునికి వారు తమతమ వృత్తాంతములను చెప్పి యతని వృత్తాంత మడుగ నతఁ డిట్లు చెప్పసాగెను .

అపుడు పారావతనాగునిశాపమువలన నేను మిమ్మెడఁబాసి ఒంటరి నై తెలివి పోయి యచటనే చిరకాలము తిరుగు చుంటిని. మఱునాఁడు దూరము తిరిగి మూర్ఛిల్లి నేలఁ బడితిని. తెలివి వచ్చునప్పటికి అడవియోరను గొప్పదివ్యనగరమం దుంటిని. అచట దివ్యపురుషుఁ డొకఁడు దివ్యరమణీద్వయయుక్తుఁడు న న్నోదార్చి చన్నీళ్లు స్నానము చేయించి లోపలికిం గొనిపోయి నాకు ప్రయత్నపూర్వకముగా దివ్యభోజనము సిద్ధము చెయించి పెట్టించి తరువాత తానును తనభార్యలును భుజించెను. భోజన మయిన తర్వాత విశ్రాంతిఁ బొంది నే నతనిని 'నీ వెవరవు ? చావ నున్న న న్నేల రక్షించితివి ? నేను నాయేలిక నెడఁబాసితిని, దేహత్యాగము చేయక మానను.' అని యతనికి నావృత్తాంతము నెల్ల వర్ణించితిని. అంత నామహాత్ముఁడు, ప్రీతిపూర్వకముగా నిట్లనియె:- 'నేను యక్షుఁడను, ఈయిరువురును నాభార్యలు, నీవు మాకు అతిథివి లభించితివి. యథాశక్తి అతిథిపూజ గృహస్థులకు విధి కదా. కావున నేను నిన్నుఁ