1346
కథాసరిత్సాగరము. లం. 12. త. 6.
పథ్యమయిన యుపచారములు సేయించి, పగలు తిరుగుడువడఁగా లేచి నిజాహ్నికము తీర్చెను. అచటనే గుణాకరునికి మందు సేయించుచు కొన్నిదినములు ఇతరమంత్రులకొఱకును శశాంకవతికొఱకును ఉజ్జయినికి బోవువాఁడై కడపెను.
6-వ తరంగము.
విచిత్రకథకునికథ.
అనంతరము గుణాకరునికి గాయములు కుదిరిన తర్వాత మంచిదినమున బయలువెడలి, మృగాంకదత్తుఁడు తనతో కడు దవ్వు సాగనంప వచ్చిన బోయఱేనిని వానితోఁగూడఁ గలసి వచ్చిన మాతంగపతిని దుర్గపిశాచుని తనకు సమయమునం దోడ్పడ మాటలాడి వీడ్కొని, ఉజ్జయినీమార్గమున పయనము నడచుచుండెను. దారిలో శ్రుతథి విమలబుద్ధి గుణాకర భీమపరాక్రములతో గలసి పోవుచు ఇతరమంత్రులను వెదకుచు నతఁడు మథ్యారణ్యములో నొకనాఁడు ఒకచెట్టుక్రింద ఈయం దఱతోను బరుండి నిద్రించు చుండెను. ఆకస్మికముగా కొంత సేపటికి మేల్కొని కన్ను దెఱచి చూచునంతటికి మృగాంకదత్తునికి తనచెంత ఎక్కువగా నింకొకమనుష్యుఁడు నిద్రించుచు అగపడెను. వానిమోముపయిముసుఁగు తీసి చూఁడ నతఁడు ఇతని మంత్రి విచిత్రకథకుఁడు. రాజు ఆతనిని ఆనవాలు పట్టెను.