ప్రజ్ఞాపారమిత.
1341
చిత్రగుప్తుఁడు హితము చెప్పఁగా, సింహవిక్రముఁడు ఆశ్చర్యపడి లజ్జపడి తలవాంచి భయముతో అట్లే చేసెద నని యెప్పు కొనెను.
వెంటనే ధర్మరాజు చిత్రగుప్తుని 'ఏమోయి ఈదొంగకు పుణ్యాంశ మే మయినం గలదా లేదా?' అని యడిగెను. 'దేవా, కలదు, వీఁడు అతిథిపూజాపరాయణుఁడు, తనయిష్టదేవత తనియుటకై యాచకునికి తన భార్యనుం గూడ నిచ్చిన వాఁడు, కాన వీనికి ఒకదివ్యదినము స్వర్గవాసము కలదు.' అని చిత్రగుప్తుఁ డుత్తరము పలికెను. అంతట ధర్మరాజు సింహవిక్రముని 'ఓరీ, నీవు శుభాశుభములు రెంటిలోను ముం దేది యనుభవించెదవు చెప్పుము.' అని యడిగెను. శుభమునే సింహవిక్రముఁడు కోరుకొనేను. అంతట సింహవిక్రముఁడు యమధర్మరాజాజ్ఞచే వచ్చినట్టివిమాన మెక్కి చిత్రగుప్తుడు చెప్పిన హితమును తలపోసికొనుచు స్వర్గమునకుఁ బోయెను. అట భోగములు కోరక మందాకినీస్నానజపవ్రత పరాయణుఁడై యుండఁగా, రెండవదివ్యదినము వచ్చెను. ఇట్లు స్వర్గముం బొంది తీవ్రసంయోగముతో తపస్సుచేసి శంకరుం గొలిచి జ్ఞానముం బొంది పాపముం గాల్చివేసెను. అంతట నరకదూతలు ఇతని మొగమును చూడనేనియు శక్తులు గారైరి. చిత్రగుప్తుఁడు భూర్జపత్రముతో వీని పాపమును తుడిచివేసెను. యముఁడు ఊరకుండెను. ఈవిధమున దొంగ సింహవికముఁడు సయి