ధైర్యపారమిత.
1333
కారణము, కావున నాయజ్ఞానమే నాకు ఇవ్విషయమున నపకారి, కావున దానినే సంహరింపవలయును. అటుగాక వీరు అపకారు లని వధ్యు లగుదురేని ఉపకారు లని ఏల రక్షణీయులు గారు? వీరు నాకీపాటు సేయరేని మోక్షదాయియగు నోర్పును నే నెట్లు ఎవరివిషయమై పూనుదును? కావున వీరు నాకు సంపూర్ణముగా నుపకార మొనర్చినారు.' ఇత్యాది బహువాక్యములచే క్షమాపరుఁ డామహాముని శేఖరజ్యోతిని శిష్యుని బోధించి దొంగలకు శిక్షను తప్పించెను. అంత నతనికి క్షమాతపోమాహాత్మ్యంబున దేహము ఎప్పటియట్ల అక్షతమై సిద్ధులు కూడ ఆవిర్భవించినవి. ఈతీరున క్షమావంతులు సంసారమును దాఁటుదురు. కావున క్షమాపారమితను వర్ణించితిని. ఇఁక ధైర్యపారమితను వినుము.
ధైర్యపారమిత.
పూర్వము మాలాధరుఁ డని బ్రాహ్మణకుమారుఁ డొకఁడుండెను. అతఁ డొకనాఁడు ఆకాశమునం బోవుచున్న సిద్ధ కుమారు నొకనిం గని అతనితో పోటికి గడ్డితో ఱెక్కలు చేసి కట్టుకొని పైకి ఎగసియెగసి గమనాభ్యాసము చేయుచుండెను. ప్రతిదినముం గుమారస్వామి పోవుచుం గని 'పాపము ! ఈబాలుఁడు ధైర్యశాలి, పొంద రాని విషయమందుఁ గూఢ కష్టపడుచు జతనము విడుకున్నాఁడు. కావున వీఁడు కనికరింపఁదగిన వాఁడు. వీనిని నేను నా వానిఁగాఁ గైకొనియెద.' అని తలపోసి,