వరాహబోధిసత్త్వుని కథ.
1319
దంపతుల యీ సంభాషణను విని సంతసించి 'అహో! ఎట్టి భయంకర రాత్రి యిది! ఎట్టి ముసురు! నా కిట్టియతిథులు దొరికినారు! ఏమి నా పుణ్యము! కావున విఘ్న మేమియు కలుగక మున్న క్షణవినాశి యగు నీదేహముతో ఈయతిథులకు సంతర్పణ చేసెదను గాక.' అని సంకల్పించి, 'లేచి వచ్చి నెయ్యపు మాటల సింహముతో 'కల్యాణుఁడా, దిగు లొందకుము, సపుత్త్రకళత్రునికి నీకు ఇదె నేన యోగిరమను. నన్ను ఆరగింపుఁడు.' అని పల్కెను. సింహము సంతసించి భార్యతో 'ప్రేయసీ, ముందుగా మనపుత్త్రుఁడు భుజించును గాక, నే ననంతరము భుజించెదను, నీ వటుతర్వాత భుజింతువు.' అనెను. సింహి వల్లె యన సింగపుఁగొదమ ముందుగా నాపందిమాంసమును భక్షించెను. అనంతరము సింహము తినసాఁగెను. అది తినుచుండ మహాసత్త్వము ఆపంది 'మిత్త్రా, ఈ నానెత్తుటిని నేల నింకకముందే త్వరగా త్రావుము, నామాంసమును తనివి తీఱఁ దినుము. మిగత నీభార్య తినుఁగాక.' అని పలుకుచు క్రమముగా సింగంబుచేత నెమ్ములుమాత్రము మిగుల భక్షిత మాయెను. అట్లయ్యును ధీర మయిన యాపంది సత్త్వవంతము తనధీరతకు తుది యెక్కడనో కని పట్టనో యన నిలిచియున్న ప్రాణములం బాయ దాయెను. ఈ లోపల ఆఁకటి పెల్లున సింహి గతాసు వయినది. అంతట సింహము పిల్లతోఁ గూడ నెటకో పోయినది. రాత్రియు తెల్లవాఱినది. అప్పుడు పంది చెలికాఁడు కోఁతి మే