Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1316

కథాసరిత్సాగరము. లం. 12. త. 5

బౌద్ధమతమును భక్తిశ్రద్ధలతో స్వీకరించెను. జనపూజా పరాయణుఁడై భిక్షువులకును బ్రాహ్మణాదులకును ఎల్లవారికి విహారములు సత్త్రములు కట్టించెను. ఆయభ్యాసంబున నుపశాంతుఁడై యొకనాఁడు భిక్షువును సత్త్వోపకారిణియైన బోధిసత్త్వ చర్య నుపదేశింపు మని వేఁడెను. భిక్షు విట్లనియె:— 'రాజా, కలుషము లెల్ల దీఱినవారే బోధిసత్త్వచర్య కధికారులు గాని యితరులు గారు. మాబోంట్ల కగపడుస్థూలకిల్బిషము నీయందేదియు లేదు గాని సూక్ష్మపాప మేమేని యున్న దానిని ఈ యుపాయమున నెఱింగి శమింపఁ జేయుము.' ఇట్లు పలికి భిక్షువు రాజునకు స్వప్నమాణవకుని ఉపదేశించెను. దాన రాజు రా రాత్రి కలఁ గని ప్రాతఃకాలమున గురువుతో నిట్లనియె: "ఆచార్యా, కలలో నేను పరలోకమున కేఁగితిని. అట నాఁకలి గొని యన్నమడిగితిని. అంతట దండపాణులు పురుషులు 'రాజా, ఇదిగో తిను, కాలినయిసుక విస్తారముగా నున్నది, నీవు ఆర్జించుకొంటివే. పూర్వ మిది ఆఁకలిగొని వచ్చి ని న్నన్నమడిగిన బ్రాహ్మణునికి నీవు ఇచ్చియుండలేదా ? పదికోట్లవరహాలు దానము చేసితివేని యీపాపము తొలఁగును.' అని పలికిరి. వా రిట్లు చెప్పినవెంటనే నేను మేలుకొంటిని.” ఇట్లు గురువుతోఁ బలికి అందుల మూలము నతనికిఁ దెలిపి వినీతమతి యాచకులకు పదికోట్లవరహాలు దాన మొనర్చెను. అనంతరము మరల స్వప్నమాణవకుని చేసెను. అట్లే కలలో పరలోకము కేఁగి ఆఁకలి గొని యన్న