వినీతమతి కథ.
1315
నేకాంతమునకుం బోయి తెఱచిచూచి, ఇసుకం గని, 'ఆహా ! వానిచే మోసపోయితిని గదా.' యని వగచుచు నింటికిం బోయెను. వినీతమతియు ఈవృత్తాంతమును తలపెట్టక జూదము మాని ప్రియాద్వయయుతుఁడై తనయింట యథేచ్ఛముండెను. ఇట్లుండ ఉదయతుంగమహారాజు ముదిమి ముదిరి సంధివిగ్రహములందు పటిమ దప్పి రాజ్యభారమున కక్షముఁడై అపుత్త్రుఁ డగుటచే నల్లునికి రాజ్యాభిషేకము చేసి ఆత్మముక్తికై గంగాతీరమునకుం బోయెను. రాజ్యము వచ్చినవెంటనే వినీతమతి అశ్వ ఖడ్గప్రభావంబువలన దశ దిక్కులను జయించెను. అతని రాజ్యము ఆ యీతిఘ్నాంగుళీయకము ప్రభావంబున రఘుపతి రాజ్యముం బోలె రోగదుర్భిక్షములు లేక యుండెను.
ఒకనాఁడు వినీతమతికడకు భిక్షు వొకఁడు రత్నచంద్రమతి అనువాఁడు వాదియేనుఁగులసింగము వచ్చి యాతిథ్యము గొని గుణపరాయణుని వినీతమతిని వాదమునకుఁ బిలిచి పందె మివ్విధమున నియమించెను. - 'రాజా, నీ వోడుదువేని మదీయమైన బౌద్ధమతము నవలంబింపవలసినది. నే నోడుదునేని చీవరము మాని బ్రాహ్మణులను శుశ్రూష సేసెద.' ఇందుల కొప్పుకొని రాజు అతనితో ఏడుదినములు వాదించెను. వాదితలబడిత నారాజకన్య నుదయవతిని ఎవఁడు జయించెనో ఆ వినీతమతి యిపు డీ భిక్షువుచేత ఎనిమిదవనాఁడు ఓడిపోయెను. అంత నారాజు ఆభిక్షువునుపదేశంబున సత్త్వోపకారపుణ్యాఢ్య మైన