Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినీతమతి కథ.

1313

ఈవడువున నాలుగురత్నంబులతోను సుగుణంబులతోను వర్ధిల్లుచున్న కుమారునితో తండ్రి కమలమతి యొకనాఁడు ఏకాంతంబున నిట్లనియె:- 'పుత్త్రా, ఇట మన యేలిక యుదయతుంగునికి సర్వవిద్యావిశారద కూఁతురు ఉదయవతి కలదు గదా. బ్రాహ్మణుఁడేని క్షత్త్రియుఁడేని ఆమెను వాదమున నెవఁడు జయించునో వాని కామె నిచ్చి వివాహము సేయునట్లు తండ్రి శుల్కనియమ మేర్పఱిచి యున్నాఁడు. ఆమెచే జగదాశ్చర్యకర మయినరూపముచే తెఱగంటి తెఱవలుమాత్రము గాక విద్యావాదముచే వాదు లెల్ల నోటువడినారు. నీ వేకవీరుఁడ వయ్యు క్షత్త్రియకులమందుఁ గల్గినయీవాదము వొప్పరికించి యున్నా వేమి? ఈమెను వాదమున నోడించి వివాహము కమ్ము.' తండ్రి యిట్లు పలుక కుమారుఁడు 'నాయనా, మము బోంట్లకు ప్రకృతి వేశల లయిన స్త్రీలతో వాద మన నెట్టిది? అయినను నీయాజ్ఞను జరిపెదను.' అని యుత్తర మిచ్చెను. అంతట కమలమతి రాజుకడకుం బోయి 'దేవా నా కుమారుఁడు ఱేపుప్రాతఃకాలమున తమ కొమారితతో వాదము సేయ నున్నాఁడు.' అని విన్నవించెను. రాజు ఒప్పుకొనెను. ఆమాటను తండ్రి వచ్చి వినీతమతికి తెలియఁజేసెను. మఱునాఁడు ప్రాతఃకాలమున వినీతమతి భాస్వంతుఁడు వచ్చి, రాజహంసాధిష్ఠితమైన విద్వత్సభాకమలినిని అందలి గుణవంతుల కనుదేంట్లు తన్నుఁ జూచుచుండ నలరించెను. మఱుక్షణమున రాజకన్య యుదయ