1312
కథాసరిత్సాగరము. లం. 12. త. 5
నెక్కించుకొని గుఱ్ఱముప్రభావముచే నప్పుడే మానసముం జేరెను. సరస్సు కాలజిహ్వునిమీఁది కనికరముచేత వినీతమతిని రావల దని గాలికిం గదలు తామరచేతులతోను జక్కవ కూఁతలతోను నివారించునదివోలె నుండెను. అచట గంధమాలిని యక్షులవశంబున నుండం గని వానిని విడిపించువాఁడై వినీతమతి యామ్రుక్కడులను కత్తితోఁ గొట్టి తఱిమివేసెను. దానిం గని సరస్సునడును నుండి కాలజిహ్వుఁడు జక్కవనాతి రూపు మాని కాలమేఘమువోలె గర్జించుచు లేచెను. పోరు ఆకసమున కెక్క, కాలజిహ్వుఁడు వినీతమతిపై కెగయ, నతఁడు గుఱ్ఱముతోనే ఎగసి కాలజిహ్వుని జుట్టునం బట్టుకొని కత్తితో తల నఱుక నున్నంతలో, కాలజిహ్వుఁడు దీనముగా జాలి పుట్ట మొఱపెట్టుచు వినీతమతిని శరణుఁ జొచ్చి, విడుపొంది, జేతకు ఈతిబాధలం దొలంచునదైన తనయుంగరమును కానుక యిచ్చి, నమ్రుఁ డయి, గంధమాలిని దాస్యమునుండి విడుదల చేసెను. గంధమాలియు సంతోషాంబుధిం దేలి వినీతమతికి తనకుమారిని విజయవతిని ఇచ్చి యింటికిం బోయెను. అంతట వినీతమతి ఖడ్గాంగుళీయ కాశ్వ కన్యారత్నంబులతో పలపల వేగునప్పటికి ఇల్లు సేరెను. తండ్రి సంతోషించెను. రాజుసయితము వృత్తాంతము విని సంతోషించెను. వినీతమతి యంతట విజయవతిని వివాహ మాడెను.