గుణాకరుని కథ.
1307
గల పురుషు నొకని సంపాదించితిమి. అతఁడు మనమేటిబీరంపు మగలను ఏనూర్గురను తెగటార్చినాఁడు. అమితముగా గాయములు తగిలి సొమ్మసిల్లియున్నాడు. తెచ్చినారము.' ఆమాట విని భిల్లరాజు ఆపురుషునిఁ దెచ్చి తమకు చూపు మని సేనాపతి కాన వెట్టెను, దళవాయియు అతనిం దెచ్చెను. త్రాళులం గట్టువడి యూఁగు లాడుచు పోటుముట్టుల గాయపుగండ్ల నుండి తొరుఁగురక్తమున నంటిన కలనినేలదుమ్ముచే మసటువడియున్న యా పురుషుఁడు చెక్కుల చెందిరమున కంటిన పచ్చనిమదపు నీళ్లయోడికలు గలిగి త్రాళ్లం గట్టువడి యూఁగుచున్న మస్తీ వోలె నుండెను. అంతలో నతనిని మృగాంకదత్తుఁడు తన మంత్రి గుణాకరునిఁగా నానవాలుపట్టి పరువునఁ దఱిసి ఏడ్చుచు కంఠమునం గౌఁగిలించెను. తనయేలిక మృగాంకదత్తుని పాదముల వ్రాలియున్న యాతని బోయఱేఁడును, అతనిచెలులవలన గుణాకరమంత్రి యని తెలిసికొని వినయముతో నోదార్చెను. తన యింటికిం గొనిపోయి స్నానము చేయించి గాయములకు కట్లుకట్టి వైద్యోక్తక్రమమునం బథ్యముగా అన్నపానము లొనరించి స్వస్థులం జేసెను. అనంతరము మృగాంకదత్తుఁ డడుగ, గుణాకరుఁడు ఎల్లరు విన ఇట్లని నిజవృత్తాంతముం జెప్పెను.
దేవా, అప్పుడు నాగశాపమువలన నేను మిమ్ముఁ బాసి ఏమియుం దెలియని మూఢావస్థం బొంది దూరమున నొక యెడారిలోఁ బడి చిరకాల మటనే క్రుమ్మరుచుంటిని. అనంతరము