కనకమంజరి చేసినవంచన.
1301
రీ యంగనామణి మౌనమునఁ గదలక థ్యాననిష్ఠయై యున్నది. దేవతయా? ఈరూపు మమానుషము గదా' అని యడిగెను. అంతట వంది యామెం గని 'ఆహా! మహారాజా, నీకు శ్రేయము. ఈమెయే గదా హంసావళి, దొరకినది.' అని నుడివెను. అంతట హంసావళి వారి నిరువురం గని మనోరథసిద్ధిని ఆనవాలు పట్టినదై పూర్వదుఃఖ మెల్ల నొక్కమాఱే యిపుడు ముంచుకొని రాఁగా 'అయ్యో; నాయనా, అయ్యో ; ఆర్యపుత్త్రా, కమలాకరా, అయ్యో! మనోరథసిద్ధీ! అయ్యయో ! విథీ, విపరీత కారీ!' అని వివశయై విలపించి మూర్ఛిల్లి నేల వ్రాలెను. వినియుం గనియుం గమలాకరుఁడు వనటం బడి నేలఁ గూలెను. మనోరథసిద్ధి యోదార్పఁగా ఇరువురును దేరి, ఒండొరువుల నెఱింగి, కరము వనట దీఱి, విషాదార్ణవము దాఁటి ఏమో చెప్ప నలవిగాని యానంద మనుభవించిరి. తర్వాత ఒండొరులకు తన తన వృత్తాంతమును చెప్పుకొనిరి. అనంతరము కమలాకరుఁడు హంసావళిని గైకొని మనోరథసిద్ధిని వెంటఁగొని తన నగరము కోసలకుం జనియెను. అట హంసావళీజనకుని మేఘమాలిని రప్పించి యథావిధిగా యథావిభవముగా జ్వరహారిని హంసావళీహస్తమును గ్రహించెను. అట్లు విశుద్ధోభయపక్ష యగు నాహంసావళితోఁ గూడుకొన్నవాఁడై కమలాకరుఁడు మునుపటికన్న నతి విమలుఁడై యొప్పెసఁగి ధైర్యముచే కార్య