1040
కథాసరిత్సాగరము. లం. 10. త. 2.
నెఱిఁగిన బంధువులు వారించుచున్నను వినక పతితోఁ గూడ చిత యెక్కి, సహగమనము చేసెను. ఇట్లు స్త్రీల చిత్తగతి దురవధార్యము. ఇతరునితో సంగమింతురు. పతితో సహగమనము చేయుదురు.
దేవదాసుని కథ.
ఇట్లు తపంతకుఁడు పలుక హరిశిఖుఁ డనియె: - దేవా, దేవదాసుని వృత్తాంతమును విన లేదా. దేవదాసుఁ డని యొక కుటుంబి యీగ్రామములో నుండెను. వానికి దుశ్శీల యని యన్వర్థనామధేయ భార్య యుండెను. అది పరపురుషాసక్త యని ఇరుగుపొరుగువారు ఎఱిఁగిరి. ఒకనాఁడు దేవదాసుఁడు కార్యవశమున రాచనగరికిఁ బోయెను. ఆసమయమందు వాని భార్య వానిని చంపింపఁ గోరి పరపురుషుని తోడ్కొని వచ్చి యింటిమీఁద కూర్చుండఁ బెట్టెను. పతి ఇంటికి వచ్చి భుజించి నిద్రించుచుండఁగా రాత్రి వానిని పరపురుషునిచేత చంపించి, వెలువడి 'నాభర్తను తస్కరులు చంపినారు.' అని విలపింపఁ దొడంగెను. అంత నచటికి బంధువులు వచ్చి చూచి ఇతనిని దొంగలు చంపిరేని ధన మేమియు హరింప లే దేమి?' అని పలికి, దాని కుమారుని బాలుని 'మీ నాయన నెవరు చంపినారు? ' అని యడిగిరి. 'ఇంటిమీఁద ఎక్కి ఎవఁడో పడుచువాఁడు పగలు కూర్చుండి యుండెను. వాఁడే రాత్రి నేను చూచుచుండఁగానే నాయనను చంపినాఁడు, నన్ను ముందుగా