Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1296

కథాసరిత్సాగరము. లం. 12. త. 4

జేరి, యలయికచే కూర్చుండెను. వృక్షము లామెను గాలి కాడుచున్న కొమ్మవీవనలతో వీచి సేద దేర్చినవి. కలయఁ బూచిన తీయమావులపై కోకిలలు ఘోషిల్లు చుండ, మధు వెల్లెడలం గురియు చుండ, నా వనిం గని హంసావళి డీలుపడి, 'హా! పుప్పొడి పసిమి పసల యీ జము దెస తెమ్మెరచిచ్చు నన్ను దరికొల్పుచున్నది: మ్రాఁకులనుండి రాలు నీపూలమొత్తములు తేఁటి కూటువుల రొదతోడ వలరాయని యలుఁగుదుటుములో యన నన్ను డూయుచున్నవి ! అయినను ఈ పువ్వులతోనే రమాపతిని బూజించుచు నిటనే నాపాపము తఱిఁగించు చుండెదను.' అని నిశ్చయించుకొని, అటనే యందలి బావులలో స్నానములు సేయుచు పండ్లే యాహారముగా కమలాకరప్రాప్తికై నిరంతరము హరిపూజ సల్పుచుండెను.

ఈలోపల కోసలయందు కమలాకరమహీనాథునికి దైవయోగంబున చాతుర్థిక జ్వరము కలిగి చిరకాలము కుదుర కుండెను. అంతట నాపాపాత్మరాలు కపటహంసావళి కనకమంజరి దిగు లొంది మదిలో నిట్లు తలపోసెను. 'అశోకకరి యెప్పుడు నాగుట్టును బయట వేయునో యని యిప్పటి కొక భయము నాకు సర్వదా కలిగియే యున్నది. ఇట్లుండ నిపుడు రెండవది ప్రాపించినది. ఎట్లన, పూర్వ మీయనతో జనసన్నిధిని హంసావళితండ్రి చెప్పియుండెను గదా, హంసావళి చేతితోఁ దాఁకిన నెట్టిజ్వరమేనియు వెంటనే శమిల్లునని. అది గనుక ఈప్ర