కనకమంజరి చేసినవంచన.
1289
గలఁడు. కొంతకాలము ఈమెకు కొంచెము క్లేశము కలుగును.' ఇట్లు కటాక్షింపగా నేను వేకువను మేల్కొని హంసావళీకర స్పర్శచే శాంతజ్వరుఁడ నైతిని. ఇట్లు మీసంయోగము దేవునిచే నిర్మితము. కాన నీకు హంసావళి నిచ్చితిని." ఇట్లు వాక్రుచ్చి మేఘమాలి అపుడే శుభలగ్నము నిర్ణయించి రాజధాని కేఁగెను.
కనకమంజరి చేసినవంచన.
తండ్రి చేసిన యా నిశ్చయమును హంసావళి విని కనకమంజరి యనుసఖితో రహస్యజ్ఞతో నిట్లనియె: - 'సఖి, నీవు పోయి కని రమ్ము, ఈరాజపుత్త్రుఁడు ఆముచ్చి వ్రాసిన చిత్తరువున నగపడి నాహృదయమును చోరించినవాఁడో అన్యుఁడో? నాయన ఒక వేళ అన్యుఁ డెవఁడేని ఆయనపేరివాఁడు ప్రబలుఁడు వచ్చినచో వానికి వెఱచి నన్ను ఉపాయన మిచ్చినను ఇచ్చును.' ఇట్లు హంసావళి స్వయముగా పంపఁగా కనకమంజరి వెంటనే అక్షసూత్రము అజినము జడలును దాల్చి, తాపసివేస మూని కమలాకరుని విడిదికిం బోయి పరిజనులచే తెలిపించికొనినదై ప్రవేశించి, యాతనిని, వలఱేని లోకవిజయ శీల మోహనాస్త్రము నేలెడి వేల్పుం బోలె విరాజిల్లుచున్న వానిం గని, అతనిరూపు తనయెదను మ్రుచ్చిలఁగా, ఆ క్షణమందు సమాధిప్రవిష్టవలె నై 'ఆహా ! ఇట్టి వీనిపొందును పొందనేని, ఇసీ ! ఈ జన్మ మేల, కాన ఈవిషయంబున నాహిత మొనర్చి