హంసావళీ కమలాకరుల కథ.
1285
నన్ను మోసగానిఁగాఁ దలంచును కావున నీరాజకన్యకు ఈవిషయమును యుక్తిగా బోధపఱిచెదఁ గాక.' అని యాలోచించి నాకు నమ్మక మయిన మిత్త్రు నొకనిం గలయఁ బలికికొని వింత యైన వెఱ్ఱివేసము వానికి వేసితిని. వాఁడు వెఱ్ఱివాఁడుగా తిరుగుచు దూరాన నగపడఁగా క్రీడార్థము వానిని రాజకుమారులు తమకడకు రప్పించిరి. తరువాత వేడుకకై హంసావళియు వానిని తనలోఁగిటికి రప్పింపఁగా వాఁ డట నీప్రతిమం గాంచి 'ఆహా ! యితఁడే గదా ఆకమలాకరుఁడు, హరివోలె పద్మశంఖాంకితహస్తుఁడు లక్ష్మీవిలాసాస్పదుఁడు అనంతగుణాకరుఁడు !' అని ఇట్టిపలుకుల నినుం బొగడుచు ఆనందతాండవము సలుపుచుండెను. రాజకన్యయు ఆ పొగడ్త విని నన్నుం గని 'ఏమి వీఁడు పల్కునది ? ఎవరి నిట నీవు వ్రాసితివి ?' అని అడిగెను. ఆమె నిర్బంధపెట్టఁగా నేను 'ఓసుందరాంగీ, ఈపురుషుని నిశ్చయముగా నీవెఱ్ఱివాఁ డెప్పుడో చూచియున్నాఁడు. ఈయన యొకరాజపుత్త్రుఁడు. నేను చక్కందనముపై గౌరవంబున నిట వ్రాసితిని.' అని చెప్పి నీనామగుణములను వర్ణించితిని. అంతట పొదువు చున్న నీమీఁదివలపనెడు వానకుం దడిసిన యా హంసావళియెదలో వలరాచవృక్షము అపూర్వము మొలచెను. ఆయదన నచటికి ఆమెతండ్రి మహారాజు వచ్చి, వెఱ్ఱియాట లాడుచున్న మన్మిత్త్రుని నన్నునుం గాంచి కోపగించి, మమ్ము అటనుండి తఱిమించెను. అది మొదలు ఆమె నీకై యుత్కం