హంసావళీ కమలాకరుల కథ.
1283
స్త్రీవలె ఏమి యిట్లాత్మహత్యకుం దొడంగితివి ? స్త్రీలు సయితము ఆపత్కాలమందు తేఁకువను వదలరు గదా. అందులకు నిదర్శనము చెప్పెద వినుము.
హంసావళీ కమలాకరుల కథ.
కోసల యను నగరంబున విమలాకరుఁ డని రాజుండెను. అతనికి కమలాకరుఁ డని కుమారుఁ డుండెను. ఆ కుమారుఁడు స్కంద కందర్ప తల్పద్రుమముల గెలుచుటకై బ్రహ్మసృజించెనో యన తేజో రూప దానములయందు వారిని మించి యండెను. దిగంతములయందు వందులచే పొగడ్త లొందిన యారాజకుమారుని మ్రోల నొకనాఁడు ఒకబట్టు పూర్వపరిచితుఁడు మనోరథసిద్ధుఁ డను వాఁడు అప్పుడప్పుడు ఈగాథం బాడుచుండెను.
క. కమలాసాదనసోత్సవ
సమధికరవణద్విజాళిసంగీతయుతన్
గమలాకరరతిఁ బొందక
రమణన్ హంసావళిక ధరన్ మనఁ గలదే?
ఇట్లాబట్టు పల్మాఱు పాడఁగా నొకపరి కమలాకరుఁ డిది యే మని యడుగ బట్టు ఇట్లు వివరింపం దొడంగెను :---
దేవా, దేశములు ద్రిమ్మరుచు నొకప్పుడు నేను సిరికి ఆటతోఁట యగు విదిశానగరమునకుఁ బోయితిని. అందు మేఘమాలి యనురాజు ఏలుచున్నాఁడు. నే నచట దర్దురకుఁడను భరతాచార్యునియింట నుంటిని, ఒకనాఁ డతఁడు మాట