1038
కథాసరిత్సాగరము. లం. 10. త. 2.
యుద్ధములో ఓడించి, తన రాజ్యముతో వారి రాజ్యములను సయితము గ్రహించెను. పిమ్మట కుముదికను 'నీ యెడల నేను పీతుఁడను. నీ కోరిక యేమి ? చెప్పుము, తీర్చెదను.' అని యడిగెను 'ప్రభూ, నీవు నిజముగా తుష్టుఁడవేని నా హృదయమందు చిరకాలమునుండి యున్న యీ శల్యమును తీసివేయుము, ఉజ్జయినిలో నా ప్రియుని శ్రీధరుఁ డను ద్విజకుమారుని స్వల్పాపరాధమునకు రాజు చెఱలో వేసినాఁడు. నిన్ను ఉత్తమరాజలక్షణములచే కల్యాణము పొందువానినిగా నెఱిఁగి ఈకోరిక తీర్పఁగలవాఁడ వని, భక్తితో సేవించితిని. నీవు మృతిఁ బొందితి వని, నాకోరిక తీఱదనెడి దుఃఖముచే, ఆవిప్రకుమారుఁడు లేని నాజీవిత మేల యని వైరాగ్యముచే, ప్రాణత్యాగార్థము నీచితను కూడ ఎక్కితిని.' అని కుముదిక చెప్పెను. విక్రమసింహుఁడు ' నీకోరిక తీర్చెద ; ధైర్య మవలంబించియుండుము.' అని పలికి, మంత్రి వచనమును స్మరించి,. 'వేశ్యలకు సద్భావము లే దని అనంతగుణుఁడు చెప్పినమాట తప్ప లేదు. అయినను ఈ వరాకియొక్క కోరికను నేను తీర్పవలసినది.' అని నిశ్చయించుకొని ఉజ్జయినికి తరలి శ్రీధరుని విడిపించి, కుముదికను బహుధనము లిచ్చి ప్రియసంగమ సుస్థితను గావించెను. విక్రమసింహుడు మరల తన నగరమునకు వచ్చి మంత్రివచనమును దాఁటక రాజ్య మేలుచు సుఖముగా