1280
కథాసరిత్సాగరము. లం. 12. త. 4
అంత రాజభార్య మంజుమతి యనునది వీనికై నిముసము లెన్ను చుండినది, వీనిం గనఁగానే లేచి కంఠముం గవుంగిలించుకొని, తన మంచముపైఁ గూర్చుండఁ బెట్టుకొన్న దై 'ఇపుడు నీవు వెంటం దెచ్చిన పురుషుఁ డెవరు?' అని యడిగెను. 'భయపడకు, అతఁడు నాచెలికాడు.' అని చండకేతువు చెప్పఁగా మంజుమతి వెఱ మీఱి 'చెలువుఁడా, ఈమందభాగ్యురాలికి దిగులెప్పటికి తీఱును ? ఇప్పుడే గదా ఈరాజు మృత్యువువాతం బడియు మృగాంకదత్తునిచేత మరల బ్రతికి వచ్చినాఁడు!' అనెను. 'చెలీ, వగవకుము. త్వరలో రాజును మృగాంకదత్తుని ఇరువురను నేను బరిమార్చెద.' అని ప్రతీహారుఁడు బదులు పల్కెను. అందులకు బదులుగా మరల నామె దైవచోదితయై యిట్లనియె: 'ఏల ప్రజ్ఞలు నఱికెదవు, నర్మదనీట రాజును మొసళ్లు పట్టుకొన్నప్పుడు మృగాంకదత్తుఁ డొక్కఁడే గదా అతనిని రక్షింప వచ్చెను, అప్పుడే నీవు వారి నేల చంపవైతివి, భయపడిగదా నీవు పలాయితుఁడవై వచ్చితివి. కాన ఊరకుండుము. ఈమాట నెవ్వరేనియు వినుదురు, అంతట శూరుఁ డగు నామృగాంకదత్తునివలన నీకు కీడు గలిగెడును.' ఆమె యిట్లు పలుకఁగా ఆ విటుఁడు ప్రతీహారుఁడు ఓర్వక 'ఓసి పాపాత్మురాలా, నీవు నిశ్చయముగా మృగాంకదత్తుని పై మనసు వెట్టియున్నావు, కాన ఈ కేరడమునకు ఫల మిప్పుడే యనుభవింపుము.' అని లేచి కత్తితో నామెను నఱుక నుంకించెను. అంతట నట