1278
కథాసరిత్సాగరము. లం. 12. త. 4
దత్తునికి దాసుఁడై ప్రణమిల్లి కొలు వొనర్చెను. అనంతరము బోయ ఱేని వేఁడికోలున మృగాంకదత్తుఁడు అచటనే కొన్ని దినములు నిలిచెను.
చండకేతుని కథ.
ఇట్లుండ నొకనాఁడు మృగాంకదత్తుని మ్రోల మాయావటువు చండకేతు వను తన ప్రతీహారునితో జూదమాడఁ గడంగెను. ఆసమయమున మింట మొయిళులు ఉఱుమఁగా పెంపుడు నెమళులు నటన మారంభింపఁగా మాయావటువు చూడం గౌతుకపడి యాట నిలిపెను. అంతట ద్యూతక్రీడారసజ్ఞుఁడు ఆ ప్రతీహారుఁడు 'ఈనెమళ్ల యాటం గన్న నేమి కుతుకము తీఱును? ఇవి యాటలో శిక్షితములు గావు. నాయింట నున్నది యొక నెమలి, దానికి ఆటలో సాటి యీ భూమండలములో లేదు. మీకు కుతూహలము గలదేని దానిని ఱేపు తెచ్చి మీయెదుట నాడించెదను.' అనెను. 'అట్లయిన ఱేపు తప్పక దానిని నాకుం జూపవలసినది' అని పలికి మాయావటువు దీనికృత్య శేషము నిర్వర్తించెను. మృగాంకదత్తుఁడును తన యనుచరులతో నా ముదలను విని తానును స్నానాహారాదికృత్యములు నిర్వర్తించెను. తరువాత రాత్రి కాఁగా, కటికిచీఁకటి లోక మెల్లం బొదువుకొనఁగా, అనుచరులు నిద్రం గూర్కుచుండ, మృగాంకదత్తుఁడు మేనం గస్తూరి పూసికొని నల్లవలువలు దాల్చి వీరచర్యా వినోదార్థము ఒంటరిగా ఖడ్గపాణియై బసవెలువడి పోవుచుం