Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1276

కథాసరిత్సాగరము. లం. 12. త. 4

బెంచిన యాబోయ యమరదత్తుఁడు ఆవనమును నిజరాష్ట్రమును సింహమునకు మృగాంకదత్తునికి ఇచ్చి పట్టాభిషేకము చేసి, వనాంతరమును తపోవనము నాశ్రయించును. ఇట్లని యీశ్వరుఁడు నీకు తెల్పినాఁడు. కావున మీదొర మిమ్ము మరలఁ గలసికొని భార్యను నిజరాజ్యమును పొందఁగలఁడు.

ఇట్లు మహాముని చెప్పఁ'గా, నేను దిగులు తీఱి, సంతసపడి అటనుండి వెడలి నిన్ను వెదకికొని వచ్చుచు, ఇట గలసికొంటిని. కాన పయనంపుఁ దఱిని నీవు గొలిచిన విఘ్నేశ్వరస్వామికృపచే తప్పకుండ నీవు ప్రచండశక్తిప్రముఖ మంత్రులను మరలఁ గలిసికొని నీయభీష్టము సాధింతువు.

ఇవ్విధమున విమలబుద్ధి పలుక మృగాంకదత్తుఁడు ప్రీతుడయ్యును కడమమంత్రు లగపడమికి చింతిల్లుచు వారికొఱకును శశాంకవతికొఱకును ఉజ్జయినికి పయనము సాగించెను.



4-వ తరంగము.


మాయావటువుతో చెలిమి.

పిమ్మట శ్రుతధి విమలబుద్ధిసమేతుఁ డై మృగాంకదత్తుఁడు శశాంకవతికొఱకు ఉజ్జయిని కేఁగుచు నడుమ నర్మదానదిం జేరెను. ఉప్పొంగు నలలచేతను పర్వుచున్న నుర్వుచేతను నది 'ఆహా! ఇతని నమాత్యులు వచ్చి కలయుదురు, ఇతఁడును నా