నీటిలోని యరణ్య దర్శనము.
1275
ములచే తెల్లనివియు నల్లనివియునై యుండు జంతువులు తుదకు ఈశ్వరారాధనచేతనే విముక్తిం బొందును జుమా, యని నీకు అజ్ఞానముం దొలఁగించువాఁ డై యీశ్వరుఁడు సాటి సూపెను.
బావినీట నీ కగపడిన విశేషమును వివరించెద. అందు ప్రతిబింబరూపమున భగవంతుఁడు నీకు ఇది బోధించినాఁడు. ఆకొదమసింగము మృగాంకదత్తుఁడు. దాని పదిబాహువులును అతనిమంత్రులు మీరు పదుగురును. ఆబోయ అమరదత్తుఁడు. ఆ పదిబాహువులసింగంపుఁగొదమను లొంగదని వాఁడు వనము నుండి తఱిమివేయుటయే మీతోఁగూడ మృగాంకదత్తుని అభిచారము చేసినాఁ డని అమరదత్తుఁడు నిజదేశమునుండి వెడలఁగొట్టుట. వనాంతరమున నున్నసింహియొక్క శబ్దమును వినుటయే అవంతిదేశమున నున్న శశాంకవతియొక్క ఖ్యాతిని వినుట. సింహ మటకు పోవుటయే సామాత్యుఁ డై మృగాంకదత్తుఁడు ఉజ్జయినికి పయనము సేయుట. మహావాయువుచే సింగము బాహువు లెడలుట పారావతనాగునిశాపముచే మంత్రులను మిమ్ము నెడఁబాయుట. బొజ్జకడుపు మానిసి మరల బాహువుల గూర్చుట బొజ్జకడుపువేల్పు మరల మృగాంకదత్తునితో మంత్రుల మిమ్ముం గూర్చుట. సింహము మృగాంకదత్తుఁడు అటనుండి పోయి బెడిదపుటిడుమలం బడి జయించి మఱియొక తావున అనఁగా ఉజ్జయినిలో ఆసింహిని శశాంకవతిని బడసి తత్సమేతముగా తొంటికానకు స్వదేశమునకు రాఁగా, దానిం