Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1274

కథాసరిత్సాగరము. లం. 12. త. 3

లై తమతమ శక్తికొలఁది పుత్త్రకళత్రాది రూప మయిన వలత్రాళ్లను మంచిపువ్వులవంటి సుఖములతోను విష పుష్పముల వంటి వైన దుఃఖములతోను కూడుకొన్న వానిని చేసికొని తమతమచేసిన వానియందు తాము తగుల్కొన్న వై పాపరూపుగల దైనకాలముచేత శుభాశుభము లనెడు నోళ్లచేత యథాక్రమముగా చంపఁబడినవి. పిమ్మట నవి కుండలరూపున నానాజంతు జాతులయందు, స్త్రీరూపయైన యామాయచేత వేయఁబడినవై, అట జన్మించి మరల మునుపటియట్లే తమతమకు సమానములయిన తెల్లరూపములను నల్లరూపములను పొంది క్రమముగా సుఖదుఃఖము లొసంగు జాలపాశరూప పుత్త్రాదులం బడసినవి. అంతట నల్లనివి తమవలలలో తామే తగులుకొని దుఃఖ మను విషముచే నో వొంది బెంగ గొని పరమేశ్వరుని శరణుకై మొఱవెట్ట సాగినవి. దానిం గని విరక్తి వొడమి తెల్లనివి సయితము తమవలలలోనుండి తమ్ము కావు మని ఆ పరమేశ్వరునికే మొఱపెట్టం దొడంగినవి. అంతట నా తాపసుఁడే పరమేశ్వరుఁడు మేల్కొని జ్ఞానాగ్నిజ్వాలలచేత ఆ యెల్లజంతువులయు వలత్రాళ్లను కాల్చివేసెను. అంత నవి పగడంపు గొట్టము ననఁగా సూర్యమండలమును జొచ్చి దానిపై నున్న పరమపదముం జేరినవి. అంతట చక్రమువలె తిరుగుచుండు సంసారముతోను వృషఖరములుగా నగపడిన యాధర్మాధర్మములతోను ఆ మాయ మాయ మైనది. ఈతీరున సంసారములో మునింగి పుణ్యపాప