1272
కథాసరిత్సాగరము. లం. 12. త. 3
సాగినవి. అందుకై తమతమ విష్టలచేత ఇరుదెగల త్రాళ్లు రచించినవి. తెల్లవి తమత్రాళ్లలో మంచిపువ్వులను, నల్లవి తమత్రాళ్లలో విషపుష్పంబులను చేసికొన్నవి. అంత నాయాయిపాశములలో నా యా సాలె తేంట్లు సుఖం బుండఁగా, పెనుఁబా మొకటి తెల్లపడగయు నల్లపడగయుం గలది వచ్చి ఆయావన్నెతలతో ఆయావన్నె సాలీని కఱచినది. అంత నాచెలువ వాని నెల్ల వెవ్వేఱుకుండలలో వేసినది. అవి యెల్ల అందుండి బయలు వెడలి వెండియు నా పాశములకే తగులుకొన్నవి. విషపుష్పముల వలలలోనివి విషవేగముచేత నేడువఁ దొడంగినవి. దానిం గని లాఁతివలలలోనివి సయితము ఏడువఁ దొడంగినవి. ఆయేడ్పునకు అట సమాధినిష్ఠుఁ డై యున్న యొక ముని థ్యానభంగ మొంది వీనిం గని కనికరించి నుదుటినుండి నిప్పుమంటలు సారించెను. ఆమంటలకు త్రాళ్లన్నియు కాలిపోఁగా నాసాలె తేంట్లు గొట్టముగా నున్న యొకపగడంపు దండములోఁ దూఱి దానినెత్తిని దేదీప్యమాన మైన వెలుఁగులో నడంగి పోయినవి. చక్రవృషగర్దభములతోఁగూడ ఆస్త్రీ అదృశ్య యాయెను.
నీటిలో నరణ్యదర్శనము.
దాని కాశ్చర్యపడుచు నే నచటనే త్రిమ్మరుచుండఁగా నట మనోహరమైన పుష్కరిణి యొకటి యగపడెను. అది పద్మ ముఖముతో తేఁటియులివులతో నన్ను, రావోయి, యని పిలుచుచున్న ట్లుండెను. నేను గట్టునం గూర్చుండి దానిసొంపు