విమలబుద్ధి కథ.
1271
కడమ మంత్రులవార్త యేమని యడిగెను. ప్రియభృత్యుఁడయిన మృగాంకదత్తునితో విమలబుద్ధి యిట్లని చెప్పెను: -
విమలబుద్ధి కథ.
దేవా, నాగశాపముచే వా రెట కేఁగిరో నే నెఱుంగను. కాని వారు నిన్ను మఱలం గూడుదు రని మాత్ర మెఱుంగుదును. ఎ ట్లెఱింగితినో చెప్పెద వినుము - అట్లు నేను నాగశాపముచే ఎటనో పోయి పడి యడవికి తూర్పుభాగములో తిరిగి తిరిగి యలసి యుంటిని. అంతట సజ్జనుఁ డొకఁడు నన్ను బ్రహ్మదండి యను మహర్షి యాశ్రమమునకుం దోడ్కొని పోయెను.
సంసారచక్రము.
అట నాఋషి, యిడిన పండ్లు భుజించి నీరు గ్రోలి సేదదేరి అటనే యిటు నటుం దిరుగుచు ఆయాశ్రమము చెంతనే యొక మహాగుహం గంటిని. అంతట కౌతుకముచేత లోనికి పోఁగా నచట మణిభవన మొకటి యగపడెను. నేను కిటికీల గుండ చూడ దొరఁకొంటిని. అంత నాభవనములోన నొకచెలువ తేంట్లతోడి చక్ర మొకటి త్రిప్పుచుండెను. పిమ్మట తేంట్లు ఆటనున్న యొకయెద్దును గాడిదను వెవ్వేఱుగా నాశ్రయించినవి. అంతట ఎద్దు పాలను గాడిద నెత్తురును గ్రక్కినవి. దానిమీఁది తేంట్లు ఆపాలను, దీనిమీఁదివి ఈనెత్తుటిని త్రాగి; అవి తెల్లనివియు ఇవి నల్లనివియు నై, అన్నియు సాలెపురువులై వలలు పన్న