కుముదిక యనువేశ్య కథ.
1037
బోవు నవసరమున కుముదిక వచ్చియున్న దని తెలిసికొని రాజు ఆవులించి లేచెను. 'ఆహా! మహారాజు బ్రదికినాఁడు! ' అని పలుకుచు పరిజనులు అతనిని మరల ఇంటికిఁ గొనిపోయిరి. ఆసంతసమునకు కుముదిక ఉత్సవము చేయఁగా, రాజు మంత్రిని ఏకాంతమున 'ఏమి కుముదికయొక్క స్నేహమును చూచితివా?' అని యడిగెను. 'ఇప్పటికిని ఈప్రేమను నేను నమ్మను. దీని కారణమును కనిపట్ట లే కున్నాను. మనలను దీనికి తెలియఁబఱుచుకొని దీని బలమును తోడ్కొని పోయి శత్రువులను క్షణములో ఓడింతము,' అని మంత్రి పలికెను.
ఆ సమయములో చారుఁడు వచ్చి ఇట్లు చెప్పెను. 'శత్రువులు దేశము నాక్రమించినారు. లోకులవలన రాజు మృతిఁ బొందె నని విని శశిలేఖాదేవి అగ్నిప్రవేశము చేసినది' చారునివలన ఈమాట విని రాజు శోకాశని హతుఁ డై 'హా దేవీ! హా పతివ్రతా!' అని ఏడువఁ దొడంగెను. క్రమముగా వృత్తాంత మెఱిఁగి కుముదిక వచ్చి విక్రమసింహుని ఓదార్చెను. 'ముందే నేను చెప్పలేదా ? ఏల తామసించెదవు ! నా దండుతోఁ బోయి శత్రువులను ఉన్మూలింపుము.' అని అది పలుకఁగా రాజు దాని ధనములతో మఱియు ఎక్కువదండు సంపాదించి, ఆ దండుతో తనమిత్త్రుఁడును బలవంతుఁడు నయిన యొక రాజుకడకు పోయి, అతని బలములను తనబలమును చేర్చి తోడ్కొని, యా యైదుగురు శత్రువులమీఁదికి నడచి, వారిని