1268
కథాసరిత్సాగరము. లం. 12. త. 3
నారణ్యంబున ఒంటరిగా నున్నారు?' అని యడిగెను. తాపసుఁడు చెప్పం దొడంగెను:--
పారావతనాగుఁడు మృగాంకదత్తాదులను శపించుట.
'నేను శుద్ధకీర్తి యను మహాగురుని శిష్యుఁడను, నానా మంత్ర సిద్ధులు గలవాఁ డను. అట్టి నే నొకనాఁడు సులక్షణుఁ డయిన యొక క్షత్త్రియ కుమారునికి ఆవేశము రప్పించి యడుగ నతఁడు నానావిధముల సిధౌషధులను రసములను క్షేత్రములనుం జెప్పి వెండియు నిట్లు వక్కాణించెను. 'ఇచటి కుత్తరమున వింధ్యారణ్యములో నొంటిది శింశుపావృక్షము కలదు. దాని క్రింద నొకగొప్ప నాగేంద్ర గృహము కలదు. అది తడిదుమ్ము గ్రమ్మిన జలముగా నుండును. మధ్యాహ్న కాలమున మాత్రము క్రీడించుచుండు హంసదంపతులతో సరస్సుగానుండును. అందు బలవంతుఁడు పారావత నామధేయుఁడు నాగేంద్రుఁ డున్నాఁడు. వానికి దేవాసుర సంగ్రామలబ్ధము సాటిలేనిది కత్తి యొకటి కలదు. దానిపేరు వైదూర్యకాంతి. దానిని ఏ నరుఁడు సాధించునో అతఁడు సిద్ధులరాజై ఓటమి యెఱుంగక సుఖ ముండును. వీరులు సాయ మున్న యెడల ఆ కత్తి దొరకును.' ఇట్లని ఆ కుమారుఁడు ఆవేశమునం జెప్పఁగా నే నతనిని ఆవేశము మాన్పి వదలి, అది మొదలు లాఁతిచింత లేక ఆకత్తిని సాధించుటకు సహాయులకై యీ భూమండలం బెల్లం బరిభ్రమించుచు చే కూడక బెంగగొని యిటకు చావ వచ్చితిని.' ఈ వృత్తాంతము