Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1260

కథాసరిత్సాగరము. లం. 12. త. 2

జన్మించి సంభోగలంపటయై యుండెను. తీర్థవ్రత ప్రభావముచేత నాచేడియకు పూర్వజన్మజ్ఞానము కలిగి యుండెను. ఒకనాఁ డావేశ్య మాటల వరుసను చోడకరుఁ డను బ్రాహ్మణునికి జాపకునికి జపకాలమం దేకచిత్తత వలయు నని తెలియఁజెప్పుచు తనపూర్వజన్మవృత్తాంతమును వర్ణించెను. తుదిని శుద్ధ సంకల్పయై వేశ్య యయ్యును సద్గతిని బొందెను. అట్లే రాజా ఎవఁడు దేనిని చింతించుచు ఉండునో వాఁడు అదిగా పుట్టును.

ఇట్లు తెలిపి మునీంద్రుఁడు రాజును స్నానమునకు పోయి రమ్మని పంపి తానును మధ్యాహ్నసవనమును నిర్వర్తించెను. పుష్కరాక్షుండును అడవియేటియొడ్డునకుం బోయెను. అట ఎన్నఁడుం గని యెఱుంగమిం గుతూహలంబుచేత నాకాఱడవిం గన వచ్చిన మింటిమానికపు వెల్గో యన నొప్పుచు వినయవతి పువ్వులు గోయుచుండెను. ఆమెం గని యుత్సుకుఁడై యామె యెవతెయో యని యతఁడు జిజ్ఞాసించుచున్నంతలో నామె కూర్చుండి స్వైరముగా సఖితో 'సఖి, పూర్వము నన్నుఁ గోరిన విద్యాధరుఁడు శాపముక్తుఁడై వచ్చి, నేఁడు నాకు భర్త వచ్చు నని చెప్పిపోయినాఁడు.' అని వచించెను. సఖియు, ముని కన్యక కిట్లనియె:- "ఈదినము వేకువను నేను వినుచుండఁగా' విజితాసు మునీంద్రుఁడు ముంజకేశుఁ డనెడి శిష్యునిం బిలిచి 'వత్సా, త్వరగా పోయి తారావళీరంకుమాలుల నిటకుం దోడి తెమ్ము. ఈదినము వారికూఁతురు వినయవతికిని పుష్క,రాక్షుని