Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లావణ్యమంజరి కథ.

1259

తాఁగైకొని హంసిని ముని కిచ్చెను. మునియు దానిని శివునికి నైవేద్య మొసంగెను, పుష్కరాక్షా, నీవే ఆహంసవు. లింగముపై మీ గొడుగుఁదామర వడినపుణ్యముచేత నీవు మహారాజవుగా జన్మించితివి. ఆ హంసియే వినయవతి విద్యాధరి, విశేషముగా దానిపొలచే శివుఁడు పూజలొందెను గాన నది యీవిద్యాధరిగా జన్మించినది. ఇట్లు ఈమె నీకు పూర్వ జన్మభార్య.

విజితాసు విట్లు పలుకఁగా పుష్కరాక్షుఁడు వెండియు నతనిని 'స్వామీ, అగ్నిప్రవేశము ఎల్ల పాపములను దహించునది గదా, మా కేల దానివలన పక్షిజన్మము సంభవించినది?' అని ప్రశ్న వేసెను. ముని యిట్లనియె: - ప్రాణి యేజంతువుం దలపోయుచు మృతిఁ జెందునో ఆజంతువుగాఁ బుట్టును. అందులకు దృష్టాంతము:----

లావణ్యమంజరి కథ.

పూర్వము ఉజ్జయినీ నగరమందు నైష్ఠిక బ్రహ్మచారిణి లావణ్యమంజరి యని యొక బ్రాహ్మణ కుమారి యుండెను. అట్లుండి యామె యొకతఱిని కమలోదయుఁ డను విప్ర యువం గాంచి యతనిపై తగు లూని విరాళిచిచ్చునం గ్రాఁగుచుండియు వ్రతలోపము నొల్లక గంధవతియొడ్డునకుం బోయి యాతీర్థంబున నతని పొందునే భావించుచు దేహత్యాగము చేసెను. ఆ భావనచేత రూపవతి యనుపేర వేశ్యగా ఏకలవ్య నగరమందు