వినయవతీ పుష్కరాక్షులకథ.
1255
దాఁటఁగలను.' అని చింతించు చుండెను. అంత నచ్చట నొక చండికాలయము నిర్జనము అగపడెను. రాజు స్నాన మాడి వచ్చి యందు దేవికి మ్రొక్కి, అచట నున్న యొకవీణను ఎవరో పెట్టియున్న దానిని కేలఁ గొని, తాను స్వయముగా రచించిన గీతములచే దేవి మనస్సు వచ్చునట్లు తదీయస్తుతులు ఆవీణమీఁద పాడి అలఁతచే రాత్రియచటనే నిద్రించెను. వీణావాదనమునకు మెచ్చి చండికాదేవి తనభూతవర్గముచేత నతనిని సముద్రము నవలిగట్టున పెట్టించెను. అంతం దెల్ల వాఱఁగానే యతఁడు మేల్కాంచి చూచుకొనునప్పటికి తాను చండికాలయములో లేఁడు, అడవిలో నున్నాడు. అతఁ డాశ్చర్యపడి లేచి క్రుమ్మరుచు నొక యాశ్రమముం గాంచెను. పండ్లబరువునకు వంగిన చెట్లచే అతిథిసత్కారముగా ప్రణమిల్లుకరణిని, పులుఁగుల కూయులచే స్వాగతము పల్కుకైవడిని, ఒప్పు మీఱిన యాతపోవనమందుఁ జొచ్చి పుష్కరాక్షుఁడు శిష్యపరివృతుని మహాముని నొకనిం గని పాదములకుం బ్రణతు: డై నిలిచెను. ముని యితని కాతిథ్యము చేసి జ్ఞానదృష్టిచే నితనివృత్తాంతము నెఱింగి ఓయి పుష్కరాక్షుఁడా, నీవు ఎవతెకొఱకు వచ్చితివో ఆకన్య 'వినయవతి ఇథ్మాద్యాహరణార్థము పోయియున్నది, క్షణములో రాఁగలదు, వేచియుండుము. అది నీ పూర్వభార్య, దానిని ఇపుడే వివాహము కమ్ము.' అని వాక్రుచ్చెను. అంతట పుష్కరాక్షుఁడు మనస్సులో 'ఇతఁడే ఆముని విజితాసువు, ఇదియే