1252
కథాసరిత్సాగరము. లం. 12. త. 2
మునుకోసి తీసి దానితో పూజ ముగించెను. అంత నతనిభక్తికి మెచ్చి మహాలక్ష్మి ప్రత్యక్షమై యతనికి సార్వభౌముఁడు కాఁగల పుత్త్రుఁడు పుట్టునట్లు వర మిచ్చి, ఆతని దేహమును వజ్రదేహముగా నొనరించి దిచ్చుమొగం బాయెను. పిమ్మట నతనికి పట్టపుదేవియందు సులక్షణుఁడు కుమారుఁడు జనించెను. రాజు అతనికి హృత్పుష్కర ప్రసాదంబునం బుట్టినవాఁ డని పుష్కరాక్షనామధేయ మొసంగెను. కాలక్రమమున యౌవనవంతుఁడును గుణోన్నతుఁడు నైన యాకుమారునికి రాజ్యాభిషేక మొనరించి తాను తపోవనమునకుం బోయెను. పుష్కరాక్షుఁడును రాజై ప్రతిదినము హరుని పూజించుచుండి ఒకనాఁడు తనకు మంచిభార్యను గలిగింపు మని వర మడిగెను. 'బాలకా, నీకోరిక నెఱవేఱును లే.' అని యాసమయమున నాకాశమునుండి వాక్కు వినఁబడెను. అంతం బుష్కరాక్షుఁడు సంతుష్టుఁడై, గగనవాణిని నమ్ముకొని యెదురు సూచుచుండి, యొకనాఁడు వేఁటకై యడవికిం బోయి అందు సంభోగ లంపటంబు లై యొండొంటిం బెనఁచికొని యున్న సర్పదంపతుల నొకలొట్టియ భక్షింప నుండఁగా గని, జాలిగొని, లొట్టియం గోలం గూల నేసెను. కూలినమాత్రాన నా లొట్టియ యాదేహము విడిచి విద్యాధరుఁడై హర్షముతో పుష్కరాక్షునిఁగూర్చి యిట్లనియె:-
"రాజా, నీవు నా కుపకార మొనర్చితివి. ఎట్లన్న విను. రంకుమాలి యని విద్యాధరకుమారుఁ డొక డుండెను. అతనిని