వినయవతీ పుష్కరాక్షులకథ.
1251
ధర్మగోపుని యా భద్రదంతగజమును ఆతనిదర్పమునుం బోలె పొలియించి, మహామంత్రివచ్చి తన్ను దర్శింపఁగా, భద్రబాహు మహారాజు కరము సంతసించి, కాశికి ధర్మగోపుని కడకు అనంగలీల నడుగుట కొఱకు రాయబారము పంపెను. ధర్మగోపుఁడును ఏనుఁగు మృతి నొందినందున దుర్బలుఁడయి యిపుడు మగధరాజునకు అనంగలీల నొసంగెను. రాజులకు కాలోచితముగా నీటి ప్రబ్బలినడువడి సిద్ధమే గదా. ఈప్రకారము మహామంత్రి మంత్ర గుప్తుని ప్రజ్ఞాతిశయముచే భద్రబాహునికి అనంగలీల లభించినది. కావున నేనును ప ప్రజ్ఞాబలము చేత నాభార్యను సాధింపవలసినది.
ఇట్లు మృగాంకదత్తుఁడు వాక్రువ్వఁగా మహామంత్రి విచిత్రకథకుఁ డిట్లు వక్కాణించెను. కలలోఁ గలిగిన హారముచేతను దేవతానుగ్రహముచేతను నీకును సకలమును సిద్ధించును. దేవతానుగ్రహము వమ్ము గాదు. దాన నేది సిద్ధింపదు! అందులకు నేనొకకథ చెప్పెదను వినుము : -
వినయవతీ పుష్కరాక్షులకథ.
తక్షశిలా నగరమందు భద్రాక్షుఁ డని రా జుండెను. అతఁడు పుత్త్రార్థియై కత్తిలో మహాలక్ష్మి నావాహన చేసి ప్రతిదినమును నూటయెనిమిది తెల్లదామరలతో మౌనమునం బూజించు చుండెను. ఒకనాఁడు దైవవశమున నొక్క తామర కొఱవడఁగా నతఁడు మౌనము మాన నొల్లక తనహృదయకమల