Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనంగలీలాభద్రబాహులకథ- ప్రజ్ఞాబలము.

1249

డని ప్రకటించుచుండిరి. జనులు భక్తితో వచ్చి అతని దర్శించు చుండిరి.

ఒకరాత్రి తాను వచ్చిన కార్యమును నెఱవేర్చుకొనుటకుం దగిన యుక్తి యేమయిన నగపడునా యని యరయుచు, నగరమున శిష్యులతోఁ గూడ సంచరించుచు, దూరము నుండి హస్తిపాలుని భార్యను ఇల్లు వెలువడి భయముచే వడివడిగా నడచుచున్న దానిని ఆయుధపాణులు ముగ్గురు పురుషులు ఎటకో తోడ్కొని పోవు చుండం జూచి, 'ఇది ఎవతెయో నిక్కముగా ఇంటినుండి లేచి పోవుచున్నది.' అని నిశ్చయించి, ఎటకుపోవునో గనఁ గోరి, దూరమునుండియే అనుచరులతోఁగూడ దానివెంబడిం బోయి, అది యేయింటఁ బ్రవేశించెనో అయిల్లు గుర్తు పెట్టుకొని, వెంటనే తన యునికిపట్టుం జేరెను. తెల్లవాఱఁగానే హస్తిపాలుఁడు తన భార్య ధనము హరించుకొని ఇల్లు వెడలిపోయిన దని యెఱింగి వెదకికొనుచుండఁగా, నతనికడకు యుక్తిగా మహావ్రతి తన యనుచరులను పంపెను. భార్య కనఁబడని దుఃఖముచే హస్తిపాలుఁడు విషము త్రాగెను. వ్రత్యనుచరులు కనికరించినవారుంబోలె తమ విద్యచేత వాని విషవేగమును కుదిర్చి 'రారమ్ము మాగురువుకడకు, ఆయనకు సర్వమును దెలియును.' అని యతనిని మం త్రికడకుం దెచ్చిరి. హస్తిపాలుఁడు వ్రత్యాభరణములతో వెలుఁగొందుచున్న యామంత్రి పాదముల వ్రాలి తనభార్యవృత్తాంత మడిగెను. మంత్రి క్షణము