ఈ పుట అచ్చుదిద్దబడ్డది
1244
కథాసరిత్సాగరము. లం. 12. త. 2
వచ్చి ఆతీరున వ్రాలియున్న నరవాహనదత్తుం గాంచి కరుణాపరతంత్రుఁడై మదనమంచుకాస్పర్శతుల్యములయిన గందపునీళ్ల నతనిపైఁ జల్లెను. నరవాహనదత్తుఁడు మూర్ఛ దేరి నమస్కరింపఁగా దివ్యదృష్టి, యామునిపుంగవుఁడు 'పుత్త్రా, నీయిష్టము సిద్ధించును, ధైర్య మునుము, దాన సకలంబును అబ్బును, అందులకు నిదర్శనముగా మృగాంకదత్తునికథను చెప్పెదను. ఇప్పటికి విని యుండవేని వినుము.' అని పల్కి, స్నానము చేసి, నరవాహనదత్తుని తన యాశ్రమమునకుం దోడ్కొని పోయి, త్వరగా ఆహ్నికము ముగించి, యతనికి. పండ్లు ఆతిథ్య మొసంగి, తానును పండ్లు భుజించి యిట్లని యాకథం జెప్పందొడంగెను.