1034
కథాసరిత్సాగరము. లం. 10. త. 2.
2 - వ తరంగము.
కుముదిక యను వేశ్య కథ.
ఇట్లు మరుభూతి వేశ్యల యసద్భావమును గుఱించి చెప్పఁగా బుద్ధిమంతుఁడు గోముఖుఁడు అట్లే కుముదికకథను చెప్పెను. ప్రతిష్ఠాననగరములో విక్రమసింహుఁ డని సింహతుల్యవిక్రముఁడు అన్వర్థనాముఁడు రాజుండెను. ఆప్రభువునకు శశిలేఖ యని సుందరి ఆలంకారతనువు నదీన ప్రభవ దేవేరి యుండెను. అతని నొకప్పుడు తననగరమం దుండఁగానే ఏవురు దాయాదులు, మహాభటుఁడు వీరబాహువు సుబాహువు సుభటుఁడు ప్రతాపాదిత్యుఁడు అనువారు, అందఱును మహా బలులు దండెత్తివచ్చి ముట్టడించిరి. వారితో సామాదికమును ప్రయోగించుచున్న మంత్రిని నిరాకరించి విక్రమసింహఁడు యుద్ధమునకు వెలువడెను. రెండుసేనలకు శస్త్రాస్త్ర సంపాత ఘోరముగా యుద్ధము జరుగు చుండఁగా, విక్రమసింహుఁడు శౌర్యదర్పముచేత తాను ఏనుఁగు నెక్కి స్వయముగా యుద్ధము చేయ నారంభించెను. ఆతఁడు ధనుర్ద్వితీయుఁ డై బలములను చీల్చివేయుచుండఁగా చూచి, మహాభటాది రాజులు అయిదుగురును కలసి, అతనిని ఒక్క మొగి నెదుర్కొ నిరి. వారి బలమెల్ల కలసి మీఁదికి రాఁగా విక్రమతుంగునిదండు తక్కువ యగుటచే