1238
కథాసరిత్సాగరము. లం. 12. త. 1
నచ్చోటికే వచ్చెను. భద్రజాతిది ఆపిడి ఆరీతిని అడుసులో తగుల్కొనియున్న పతిం గని తానును సహగమనము సేయునదై మడువుబురదలోనికిఁ జొరఁబడెను. ఆసమయమున నటకు మహాతపస్సంపన్నుఁ డైన యాబ్రహ్మసిద్ధిమహాముని శిష్యసమేతుఁడై వచ్చి యీవశాగజములయవస్థం గని కనికరించి శిష్యులకు మహాబలము కలుగునట్లు వర మిచ్చి వారిచే నా రెంటిని అడుసు నుండి వెలువరింపించెను. అట్లు మృతియు ఎడఁబాపును దప్పి యానాగదంపతులు యథేచ్ఛముగా సుఖ ముండినవి. ప్రేయసీ, ఈప్రకారము గొప్పపుట్టువుగలవి తిర్యగ్జంతువులును ఇక్కట్టునం బడిన పతి నేనియు మిత్త్రు నేనియు విడనాడవు సరిగదా, రక్షింపనుం గూడ రక్షించును. నీచజాతిని బుట్టిన చంచలాత్మలహృదయమునకు గొప్పతనము గాని స్నేహము గాని తగులనేరదు.
లలితలోచనా జన్మవృత్తాంతము.
ఇట్లు వత్సేశ్వరుఁడు పల్కఁగా విని యా దివ్య కన్యక యిట్లనియె: -ప్రాణేశ్వరా, నీవు వక్కాణించినది యట్లే, ఈవిషయమందు సంశయము వలదు. ఇట్లు వాక్రుచ్చు నీ చిత్తంబు నా కెఱుకవడినది. ఆర్యపుత్త్రా, నావక్కాణించెడి యీకథను అవధరింపుము. కాన్యకుబ్జనగరమందు బాహుశక్తి యను మహారాజునొద్ద మాన్యుఁడు నూఱుగ్రామముల కొడయఁడు శూరదత్తుఁ డని బ్రాహ్మణుఁ డొకఁ డుండెను. అతని భార్యపతివ్రత, ఆమెపేరు వసుమతి. వా రిరువురకును వామదేవుఁ