నక్కపిడియేనుఁగుకథ.
1237
అంతట నరవాహనదత్తుఁడు ఆమెను గాంధర్వవిధిచే వివాహమాయెను. ఆమెతో నచట నారాత్రి, యధోచితముగాఁ గడపి తెల్లవాఱినంతట ఆప్రేయసి కుల మెఱుంగువాఁ డై అనియె: —
నక్కపిడియేనుఁగుకథ.
ప్రాణేశ్వరీ, నీకు ఒక యపూర్వకథ చెప్పెద వినుము; ఒకానొకతపోవనమందు బ్రహ్మసిద్ధి అని ముని ఒకఁ డుండెను. అతనియాశ్రమము చెంత నొకముసలినక్క యాఁడుది యొక గుహలో నివసించెను. ఒకనాఁడు ముసురుపట్టి యానక్క యాఁకట నొగులుచు గుహ వెలువడి మేఁత వెదకికొను చుండఁగా, అడవియేనుఁ గొకటి పిడి నెడఁబాసిన యున్మాదములో దానింగని చంపం దఱుముకొని వచ్చెను. అంతట జ్ఞాని దయాళువు ముని దానిం గని యా రెంటిపై కనికరించి ఆ నక్కనుపిడియేనుఁగుగా మార్చెను. ఏనుఁగు పిడిం గని వికారముతీఱిదానిమీఁద మరుల్కొనెను. నక్కకును చావు తప్పెను. పిమ్మట శరదృతువులో ఒకనాఁడు పిడితోఁగూడి విహరించుచు, ఏనుఁగు, దాని కై తామరపూ వొకటి తెచ్చునదై, మడుఁగులోనడుగువెట్టి యడుసులో దిగఁబడి, వజ్రాయుధ నిర్భిన్న పక్షమయి పడిపోయిన కొండయో యన, కదలనేరకుండెను. ఏనుఁగు ఆవిధమున నిక్కట్టునం బడి యుండఁగా నానక్కకరిణి యప్పుడే మఱియొకకరిం గూడి వెడలి పోయెను. ఇంతలో ఆమొదటిపిడి ఈయేనుఁగును పూర్వము ఎడఁబాసినట్టిది దీనిభార్య దీనిని వెదకికొనుచు దైవవశమున