వేలకథ.
1233
జూచి అందు మొదట భార్యను ఎక్కించి నేను నెక్కుటకు యత్నించునంతలో మునిశాపవశంబున విసరుగాలి వీచి నావను దూరముగా కొనిపోయెను. భార్యను కోలుపోయిన నా చేతనను లబ్ధావసరయో యన మూర్ఛ హరించెను. అచ్చట నొక తపసి మూర్ఛితుని నన్నుఁజూచి దయతో నూరార్చి తనయాశ్రమంబునకుఁ గొనిపోయి అడిగి విని శాపాంతసమయము రాఁగా దెలిసికొని నాకు చెప్పెను. అంతట అటనుండి తరలి నేను సముద్రప్రయాణము చేసి, యోడ మునుఁగఁగా, ఒడ్డు చేరి, మిత్త్రుని ఒకవర్తకుని గూడి ప్రియను వెదకుచు, పెక్కుదుర్గ ప్రదేశములను కడచి క్రమముగా ఈవైశాఖపురంబు సొచ్చి యిట వత్సరాజ సద్వంశ ముక్తామణిని హస్తినీజాతాశ్వరత్నద్వయుని నిన్నుం జూచితిని. చూచినమాత్రాన నాశాపభారము తొలంగినది. అంతఁ గొంతవడికి సాధువు లగు నాబేహారులు నాప్రియం గొని వచ్చి నాకిచ్చిరి. ఓరాజేంద్రా, యమునాదత్త సద్రత్నహస్తను ప్రేయసిం గూడి శాపసముద్రము నీఁదిన నేను నీపాదంబుల కెఱఁగి నిన్నామంత్రింపఁ గోరి వచ్చినాఁడను. మహారాజా, నాకష్టము తీఱినది. నేను సభార్యుఁడ నై స్వదేశమునకుం బోయెదను:-
ఇట్లు ఆ వణిగ్వరుండు చంద్రసారుఁడు స్వవృత్తాంతము నివేదించి చరితార్థుఁడై పోయిన తర్వాత రుచిరదేవుఁడు వత్సరాజాత్మజునికి సవినయంబుగ తన చెలియలిని జయేన్ద్రసేనను