వేలకథ.
1227
హరించితివి, వృద్ధిఁ బొందుచు శత్రువులకు భీతిని కలిగించితివి. కాఁబట్టి ఓ మహాప్రభూ, సందియం బేమియు లేక శీఘ్రముగా బలివిజయము చేసి ఆకసము నాక్రమించు నచ్యుతగుణుని నిన్ను ఖేచరులు చూడఁగలరు'. ఇట్లు పొగడి యా వణిజుఁడు యువరాజుచే సత్కృతుఁడై స్వవృత్తాంతము నిట్లు నివేదించెను. భూదేవికి శిరోరత్న మన లంప యను పట్టణము ఒకటి యొప్పుచున్నది. అందు కుసుమసారుఁ డని వర్తకుఁడు ఒకఁడు ఉండెను. ధర్మనిరతుం డగు నాతనికి శంకరానుగ్రహంబున చంద్రసారుఁ డను జనించితిని. నేను ఒకనాఁడు మిత్త్రులతో నుత్సవదర్శనార్థము ఒక పత్తనమునకుం బోయి యచ్చటి యాచకులకు దానం బొసంగెడు దాతలను జూచితిని. అంతట నాతండ్రి సంపాదించిన యపరిమిత ధనముచే నాకు తనివి తీఱక ఇంకను ధనము గడింపవలయునని తలంపుపొడమెను. పలుదీవుల సంచరింప వేఁడి నేను నవరత్నపూరిత మగు నావ నెక్కితిని. అనుకూలదైవమువలె అనుకూలవాయువు ప్రేరింపఁగా నానావ యొక ద్వీపముం జేరెను. ఆ ద్వీపమునందు రహస్యముగా నమూల్యములగు రత్నములతో వ్యాపారము సేయుచుంటిని. అచ్చటిరాజు అర్థలోభంబున నాధనముం గైకొని నన్ను చెఱసాలయందుంచెను. నరకమువంటి యా కారాగృహమునందు నాఁకలి నీరుపట్టులచేత బాధితులై దుష్కృతులైన ప్రేతములవంటి జనుల సంగడిని కొలఁదికాలం బుండితిని.